Special report on gudumba

special report on gudumba

special report on gudumba

9.gif

Posted: 07/10/2012 04:14 PM IST
Special report on gudumba

      ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన వార్త ఇది. ఆంధ్రావిశేష్.కాం గుడుంబా మూలాలపై నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ లో వింతైన విషయాలు బయటపడ్డాయి. ఆ నివేదక సమగ్ర స్వరూపం మీకోసం.. ప్రధానంగా వరంగల్‌ జిల్లా ములుగు నియోజక వర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో గుడుంబా తయారి కుటీర పరిశ్రమగా మారింది. ఏ గ్రామంలో చూసిన గుడుంబా ఏరులై పారుతుండగా నిత్యం గుడుంబా సేవించిన వారు కొద్ది రోజులలోనే మృత్యు వాత పడుతున్నారు. మగ, ఆడ, చిన్న పెద్దా తేడా లేకుండా గుడుంబా సేవించడానికి అలువాటు పడి దానికి బానిసలై మద్యం మత్తులో మునిగితేలుతున్నారు. gudum_e
      కొందరు వ్యక్తులు లేవగానే 'బెడ్‌ కాఫీ ' తాగితే గుడుంబా ప్రియులు మాత్రం ' బెడ్‌ గుడుంబా ' ను సేవిస్తున్నారు. గ్రామాల్లో మండల కేంద్రాల్లో 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలలోపు యువకులు దీనిని నిత్యం సేవిస్తూ మృత్యువడిలోకి చేరి పోతుండగా వివాహం చేసుకున్న యువతులు వితంతువులుగా మారిపోతున్నారు. దీనికి అలవాటు పడిన వారు ఉదయం లేవగానే గుడుంబా సేవించనిదే ఏ పని చేయడం లేదంటే ఈ ప్రాంతంలోని యువకులు మద్యానికి ఎంత బానిసైపొయ్యారో తెలుస్తోంది. ములుగు నియోజకవర్గంలో గుడుంబా తయారి ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి గుట్టుచప్పుడు కాకుండా వేలాది లీటర్ల గుడుంబాను జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. ప్రభుత్వ సారా అమ్మకం, మద్యం అమ్మకాలను నిలిపి వేయడంతో గ్రామాల్లో నిరుద్యోగ యువకులు గుడుంబాను తయారు చేయటం పరిశ్రమగా మార్చుకుని అమ్మకాలను చేస్తున్నారు. ఒకప్పుడు గిరిజనులు మాత్రమే దీనిని తయారు చేయగా ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నేడు గిరిజనులే కాకుండా గిరిజనేతరులు సైతం పెద్ద ఎత్తున గుడుంబా తయారు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల వారు సైతం దీనిని తయారు చేయడానికి శ్రద్ద పెడుతున్నారు. ఏరులై పారుతున్న గుడుంబాను అరికట్టాల్సిన అధికారులు మామూళ్ళకు అలువాటు పడి నియంత్రించలేక పోతున్నారని, కొన్ని ప్రాంతాల్లో నెలనెల మామూళ్ళు తీసుకుంటూ తయారి దారులను ప్రోత్సహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
       ఒకప్పుడు గిరిజనులు అటవీ ప్రాంతంలో లభించే ఇప్పపువ్వుతో మాత్రమే సాంప్రదాయబద్దంగా గుడుంబా తయారు చేసి కేవలం వారి కుటుంబ సభ్యులు మాత్రమే సేవించే వారు. గ్రామాల్లో తయారు చేసే నాటు సారాకు రోజు రోజుకు డిమాండ్‌ పెరుగుతుండగా ఇప్పపువ్వును వదిలి బెల్లం, పటిక ను నానబెట్టి బట్టిలపై కుండలను ఏర్పాటు చేసి సారాను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో గుడుంబా ప్రియులకు మత్తు అధికంగా రావడం కోసం తయారి దారులు ఏకంగా రసాయన పదార్థాలతో ఒక్కరోజులోనే తయారు చేసే విధానం నేర్చుకున్నట్లు gudumba_eeసమాచారం. నూతన పరిజ్ఞానంతో తయారు చేస్తున్న నాటు సారా కోసం యూరియాతో పాటు చెట్లుకు పిచాకారి చేసే కొన్ని రకాల మందులను బెల్లం పానకంలో కలిపి ఇళ్ల వద్ద అటవీ ప్రాంతంలో సారాను తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సారాను సేవిస్తున్న వారు వారం రోజులు తిరగక ముందు కంటి చూపు కోల్పోవడం, వణుకుడు వ్యాధి రావడం, పక్షవాతం, ఇతర వ్యాధులు సోకుతున్నట్లు తెలిసింది. ఈ వేసవి కాలం ప్రారంభం నుండి కొందరు వ్యక్తులు నాటు సారా సేవించి రోడ్లపై పడి మృతి చెందిన సంఘటనలు కోకోల్లలుగా ఉన్నాయి.
    సందట్లో సడేమియాలా నాటు సారాకు ముడి సరుకుగా ఉన్న నల్లబెల్లం వ్యాపారం ములుగు నియోజకవర్గంలో జోరుగా సాగుతున్నది. ప్రభుత్వం నుండి లైసెన్స్‌ లు పొందుతున్న వ్యాపారులు ఆ బెల్లాన్ని పశువులకు కాని, ఇతర అవసరాలకు కాని అమ్మకం చేయ్యాల్సి ఉండగా గత కొద్ది సంవత్సరాలుగా వ్యాపారులు గ్రామాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని బెల్లాన్ని అమ్మకం చేస్తున్నారు. గత కొద్ది నెలల క్రితం మేడారం జాతర జరుగుతున్న సమయంలో నల్లబెల్లం అమ్మకాలపై పోలీస్‌ శాఖ ప్రత్యేక నిఘా పెట్టి అమ్మకాలను నియంత్రించినప్పటికి జాతర ముగిసిన అనంతరం తిరిగి యధావిధిగా కొనసాగిస్తున్నారు. కామారెడ్డి, అనకాపల్లి, నిజామాబాద్‌ తదితర ప్రాంతాల నుండి ఇక్కడి వ్యాపారులు ప్రతి రోజు లారీల కొద్ది బెల్లాన్ని దిగుమతి చేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు
       యువకుల ప్రాణాలను తీస్తున్న నాటు సారా (గుడుంబా )ను అరికట్టాలని పలు మహిళ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో బెల్లం అమ్మకాలు విచ్చల విడిగా కొనసాగుతుండటంతో దానిని కొనుగోలు చేసి మద్యం తయారి దారులు నాటు సారాను తయారు చేస్తున్నారని, నాటు సారాను అరికట్టాల్సిన ఎక్సైజ్‌ సిబ్బంది తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నందని అవేదన వ్యక్తం చేశారు. నామ మాత్రంగా దాడులు నిర్వహిస్తూ తయారి దారులను నుండి సిబ్బంది నెల వారి మామూళ్ళు తీసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చోరవ చూపి గుడుంబాను అరికట్టని పక్షంలో తామే దాడులకు దిగుతామని మహిళ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T employee leaders meet kcr
Junior ntr press meet regarding kodali nani issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more