ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలిపై మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. వెంటనే పరిస్థితిని చక్కదిద్దకపోతే మంత్రివర్గం నుంచి వైదొలుగుతానని ఇటీవల గవర్నర్ నరసింహన్‌కు ఆయన లేఖ రాసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. పరిస్థితి త్వరలోనే చక్కపడుతుందని, తొందరపడవద్దని గవర్నర్ చెప్పినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మంత్రిగా తన బాధ్యతలను నిర్వహించకుండా సీఎం అడ్డుపడుతున్నారని, బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా ఫైళ్లపై తన సంతకాలు, ఆమోదం లేకుండానే తన శాఖకు చెందిన అంశాలపై ఉత్తర్వులు జారీ చేయిస్తున్నారని డీఎల్ తన లేఖలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా ఉత్తర్వులను జారీ చేయించారని డిఎల్ చెబుతున్నారట. ఇందుకు సంబంధించి ఆయన కొన్ని ఉదాహరణలు అంటూ.. ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఫార్మాసిస్ట్‌ను వైద్య విద్య శాఖకు బదిలీ చేశారని, ఇందుకు తన అనుమతి తీసుకోలేదని డిఎల్ వాపోతున్నారు. ఫార్మాసిస్ట్ బదిలీకి సంబంధించి ముఖ్యకార్యదర్శి చేసిన సిఫారసును సంబంధిత మంత్రిగా తాను తిరస్కరించానని, అయితే ముఖ్యమంత్రి మాత్రం ఆయన బదిలీకి ఆదేశాలు జారీ చేయటం జరిగిందని డీఎల్ మీడియా మందు చెబుతున్నారు. సీఎం ఆదేశాలు ఇచ్చినప్పటికీ బిజినెస్ రూల్స్ ప్రకారం ఉత్తర్వుల జారీ ఫైలు సంబంధిత మంత్రికి రావాల్సి ఉందని, కానీ తనకు ఫైలు రాకుండానే ముఖ్య కార్యదర్శి ద్వారా జీవోను జారీ చేయించారని డిఎల్ చెబుతున్నాడు. . అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కొంతమంది నర్సుల సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేసేందుకు మంత్రిగా తాను సిఫారసు చేశానని, అయితే సీఎం ఆ సిఫారసును తిరస్కరించారని డీఎల్ తన లేఖలో వివరించినట్లు సమాచారం.
తన మంత్రిత్వ శాఖకు చెందిన విధులను నిర్వర్తించనీయకుండా సీఎం అడ్డుపడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నట్లు సమాచారం. ఒకపక్క తాను పంపిన ఫైళ్లను క్లియర్ చేయకుండా తొక్కిపెడుతూ మరోపక్క తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే తన శాఖకు చెందిన విషయాలపై సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన వివరించటం జరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ విషయం లో వెంటనే జోక్యం చేసుకుని మంత్రికి రాజ్యాంగం కల్పించిన హక్కులను సీఎం హరించకుండా తగిన ఆదేశాలను జారీ చేయాలని గవర్నర్‌కు డీఎల్ విజ్ఞప్తి చేసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రిగా కొనసాగడం వృధా అని, వెంటనే పరిస్థితిని చక్కదిద్దకపోతే మంత్రివర్గం నుంచి వైదొలుగుతానని డీఎల్ స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. డీఎల్ లేఖను పరిశీలించిన గవర్నర్ తనకు స్వయంగా వచ్చి వివరించాల్సిందిగా మంత్రిని కోరినట్లు తెలుస్తోంది. సీఎంపై ఒక మంత్రి నేరుగా గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారని అధికారులు , ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more