ఎంత శ్రమించినా మొత్తనికి చిన్నారి మహి ని రక్షించుకోలేకపోయాం. హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ బోరు బావిలో చిక్కుకున్న చిన్నారి మహి(5)ని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది 86 గంటలు చేసి కృషి విఫలమైంది. మహి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. బావిలో పడిన రోజే చిన్నారి మృతి చెందినట్లు వారు తెలిపారు. మహి మృతిని జిల్లా కలెక్టర్ కూడా ధవీకరించారు. ఈనెల 20న ఇంటి ముందు ఆడుకుంటూ బోరు బావిలో పడిన మహిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బందితోపాటు వైద్యులు, సైన్యం 86 గంటలసేపు కృషి చేశారు.
వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని కషాన్ గ్రామంలో బోరుబావిలో పడిపోయిన చిన్నారి మహిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేశారు. డెబ్బై అడుగుల లోతులో ఉన్న మహికి బయటి నుంచి నాలుగు రోజులుగా ఆక్సీజన్ అందించారు. బోరు బావికి సమాంతరంగా తవ్వకాలు చేపట్టారు. అయితే బండరాళ్లు రావడంతో కొంత ఆలస్యమైంది. అయినా అధికారులు మరింత వేగంగా పనులు ప్రారంభించారు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సైన్యం, అగ్నిమాపకదళం, పోలీసులు ప్రయత్నించారు.
అయితే.. బుధవారం రాత్రి నుంచి బోరు బావి లోపలే ఉన్న చిన్నారి పరిస్థితి ఎలా ఉందో అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సంఘటనా స్థలానికి హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. చిన్నారిని వీలైనంత త్వరగా సురక్షితంగా బయటతీసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని సీఎం వెల్లడించారు కూడా. ఢిల్లీ మెట్రోరైలు టీంను కూడా రంగంలోకి దించామని చెప్పారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సంతోష్ హెగ్డే కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. బోర్ బావులను ఎలాంటి పైకప్పు లేకుండా వదిలివేయడాన్ని తప్పుబట్టారు.రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మరింత వేగవంతం చేయాలన్నారు. ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హర్యానా ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. బోరుబావి తవ్వకంలో సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించారో.. లేదో.. తెలిపాలంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more