మనిషి ఎప్పుడు ఆశావాదే? సహాజంగా ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత.. మంత్రి పదవి కోరుకోవటం సహజం. మంత్రి అయిన పిమ్మట.. వెంటనే.. పార్టీలో ముఖ్య నేతగా ... అంటే పిసీసీ గా ఎదగాలనే ఉంటుంది. అటు తరువాత మిగిలింది.. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కావటమే.. ఆ వ్యక్తి కోరిక. ఇప్పుడు అలాంటి కోరికతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ కోరుకుంటున్నాడట. తాను త్వరలో సిఎం ను అవుతానని .. తన సన్నిహితులతో చెబుతున్నాడని..కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అంతేకాదు.. లగడపాటి జాతకంలో కూడా సీఎం అవుతాడని జాతకం చెబుతుందట.
ఒక రకంగా చూస్తే లగడపాటి చెబుతుంది జరుగుతుందనిపిస్తుంది. మొన్న రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లు రావటంతో.. కాంగ్రెస్ పార్టీలో ..ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి.
లగడపాటి కూడా .. ఉప ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు రమ్మనకుండనే.. కాంగ్రెస్ పార్టీ జెండ ను భుజన వేసుకోని.. ఇంటింటికి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ ప్రచారంలో.. జగన్ పై ధైర్యంగా ఎదురు దాడి చేసిన నాయకుడిగా.. అధిష్టానం ద్రుష్టిలో పడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సమైక్యా వాదాన్నినెత్తిన పెట్టుకొని తిరిగిన నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు లగడపాటి. తెలంగాణ నాయకులపై కూడా .. విమర్శల వర్షం కురిపించి సమైక్యాంద్ర నాయకుడిగా తెలంగాణ నాయకులకు, తెలంగాణ ప్రజలకు దూరమైన విషయం తెలిసిందే. లగడపాటిలో మంచి దైర్యమున్న నాయుకుడు ఉన్నట్లు ఎన్నో సార్లు నిరూపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ లో జగన్ ను దైర్యంగా ఎదురుకొనే వ్యక్తి ఒక్క లగడపాటి రాజగోపాలే అని రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. సోనియా గాంధీ కూడా లగడపాటి పై మంచి అభిప్రాయం ఉన్నట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు.
ఒక వేళ ఇప్పుడు లగడపాటి ముఖ్యమంత్రి కాకపోయిన.. భవిష్యతుల్లో.. తప్పని సరిగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఒక వేళ రాయల తెలంగాణ ను కాంగ్రెస్ ప్రకటిస్తే.. సీమాంద్ర ప్రాంతానికి .. మొదటి సీఎం అయ్యే అవకాశలు ఉన్న వ్యక్తి ఒక్క లగడపాటేనని ఢిల్లీ నాయకులు అంటున్నారు. సో.. భవిష్యత్తుల్లో లగడపాటిని ముఖ్యమంత్రిగా చూసే రోజులు వస్తాయన్నామాట...?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more