ఉపఎన్నికల ఫలితాల తరువాత అసెంబ్లీలో రాజకీయ పార్టీల బలాబలాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసీపీ, టీఆర్ఎస్ లు బలం పుంజుకోగా, కాంగ్రెస్, టీడీపీలు నష్టపోయాయి. అయితే గుడ్డిలో మెల్లగా కాంగ్రెస్ రెండు స్థానాలను కైవసం చేసుకొని ఊరట చెందగా తెలుగుదేశానికి అది కూడా దక్కలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలో ఓడిపోయినా ఆ పార్టీ బలంలో మాత్రం మార్పు లేదు. తాజాగా ఉపఎన్నికల ఫలితాల తరువాత అసెంబ్లీలో పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీకి 155మంది ఎమ్మెల్యేల బలం ఉండగా ఏడుగురు ఎంఐఎం శాసనసభ్యుల మద్దతు తీసుకుంటే ఆ పార్టీ సంఖ్యా బలం 162. ఇందులో నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు తాజాగా రాజీనామా చేశారు. అంటే ప్రస్తుతం కాంగ్రెస్ బలం 160మంది ఎమ్మెల్యేలు. ఇక తెలుగుదేశానికి 86మంది శాసనసభ్యులు ఉండగా టీఆర్ఎస్, వైసీపీ బలం పుంజుకున్నాయి. ఈ ఉపఎన్నికలకు ముందు ఇద్దరే ఉన్న వైసీపీ సభ్యుల బలం 15నుంచి 17కు పెరిగింది. టీఆర్ఎస్ బలం అంతకుముందు 16ఉండగా పరకాల స్థానంతో 17కు చేరింది.
ఇక సీపీఐకి నలుగురు ఎమ్మెల్యేలు ఒక్క సీపీఎం ఎమ్మెల్యే, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు, లోక్ సత్తాకు ఒక ఎమ్మెల్యే ఉండగా స్వతంత్ర సభ్యులు ముగ్గురు అసెంబ్లీలో ఉన్నారు. అయితే వీరిలో కూన శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ అనుబంధ ఎమ్మెల్యేగా ఉండగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి మాత్రం ఏ పార్టీతో కలవక తటస్థుడిగా ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more