టాలీవుడ్ లో మెగా తనయుడు పెళ్లి కోసం బాలీవుడ్ , కోలీవుడ్, శాలీవుడ్ నుండి అనేక ప్రముఖులు రావటం జరిగింది. టాలీవుడ్ లో ఉన్న ప్రముఖులందరు మెగా పెళ్లి సందడిలో పాల్గొన్నారు. కానీ నందమూరి వంశం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం సమేతంగా చెర్రి పెళ్లికి హాజరైనట్లు తెలుస్తుంది. బాలయ్య కనిపించకపోటం పై కొంతమంది చెవులు కొర్కుకుంటున్నారు. బాలయ్య రాకపోవటానికి కారణం ఉండి ఉంటుందని మెగా కుటుంబ సభ్యులు అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం మరోల చెబుతున్నారు.
రామ్ చరణ్ తేజ్, ఉపాసన కామినేని వివాహం జూన్ 14న జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడకకు సినీ, రాజకీయ ప్రముఖలందరికీ ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. ఈ నేపధ్యంలో నందమూరి బాలకృష్ణ ఈ వివాహానికి హాజరు కారా అన్న సందేహం అందరికీ కలుగుతోంది. దానికి కారణం ఆయన ఊళ్లో ఉండకపోవటమే. శ్రీమన్నారాయణ షూటింగ్ నిమిత్రం స్విజ్జర్ లాండ్ వెళ్లారు. అక్కడ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. అయితే వివాహ సమయానికి వచ్చే అవాకాశం ఉంది అని కొందరంటున్నారు. షూటింగ్ బ్రేక్ చేసుకుని ఒక్కరే వచ్చి వెళ్లిపోతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు మెగా కుటుంబీకులు. ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో గ్రాండ్‌గా ఈ వివాహ మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి నిమిత్తం రామ్ చరణ్ ఇప్పటికే సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. పెళ్లికి ముందు రెండు వారాల...పెళ్లి తర్వాత మరో రెండు వారాలు చెర్రీ పూర్తిగా షూటింగులను దూరంగా ఉండి పెళ్లి సంబరంలో మునిగి తేలనున్నాడు. చరణ్-ఉపాసన వివాహం మోయినాబాద్ ప్రాంతంలో ఉన్న ఉపాసన ఫాంహౌస్‌లో జరుగబోతోంది. పెళ్లికి కేవలం చరణ్, ఉపాసన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఎంపిక చేయబడ్డ సినీ, రాజకీయ ప్రముఖులు, వివిఐపిలకు మాత్రమే ప్రవేశం ఉంది. ఎంట్రీ కోసం ఎలక్ట్రానిక్ పాస్‌లను ప్రవేశ పెట్టారు. సాధారణ జనాలకు, అభిమానులకు ఈ వేడుకలో చోటు లేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more