మరోసారి ఎస్ అండ్ పీ బాంబు పేలింది . గతవారం జోరుతో అప్పటిదాకా సాఫీగా సాగిపోతున్న స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. లాభాల్లోంచి నష్టాల బాట పట్టింది. భవిష్యత్తులో పెట్టుబడులకు భారత మార్కెట్ పనికి రాదేమోనంటూ స్టాండర్డ్ అండ్ పూర్స్ ( ఎస్ అండ్ పీ) వెలిబుచ్చిన సందేహం పెద్ద చిచ్చే పెట్టింది. బ్రెజిల్ , రష్యా , ఇండియా , ఛైనాలతో కూడిన బ్రిక్ దేశాల కూటమిలో ప్రతికూల రేటింగ్ పొందే అవకాశం తొలుత భారత్ కే ఉందంటూ ఎస్ అండ్ పీ పేర్కొంది. ఇదే జరిగితే ఇప్పటికే అవస్థల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవడం ఖాయం. రేటింగ్ కున్న ప్రభావం అటువంటిది మరి.
రెండు నెలల క్రితం ఇదే ఎస్ అండ్ పీ సంస్థ భారత్ రేటింగ్ ను బీబీబీ ( స్థిరత్వం) నుంచి బీబీబీ (ప్రతికూల స్థాయి) కి తగ్గించింది. తాజాగా ఈ రేటింగ్ లో మార్పేదీ చేయ్యకపోయినా ఆర్థిక వ్యవస్థలను విశ్లేషిస్తూ తాజాగా ఒక నివేదికను వెలువరించింది. బ్రిక్ దేశాల్లో తొలుత కూలే దేశం భారతేనా..? శీర్షికను విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం మన కంటే రాష్యా బ్రెజిల్ లు బీబీబీ రేటింగ్ లో ఒక మొట్టు పైనే ఉన్నాయి. ఇక చైనా అయతే ఈ మూడు దేశాల కంటే ఎన్నో అడుగులు ఫైన ఏఏఏ ( అత్యంత సురక్షితం) రేటింగ్ తో ఉంది. భారత్ తప్ప మిగతా బ్రిక్ దేశాలన్నిటికీ భవిష్యత్ అంచనా స్థిరత్వంగా ఉండడం ఇక్కడ గమనిచాల్సిన అంశం.
ఎస్ అండ్ పీ చెబుతున్న ఐదు కారణాలు. బ్రిక్ దేశాల్లో పెట్టుబడి గ్రెడింగ్ కోల్పోయే ప్రమాదం భారత్ కు ఉందనటానికి ఎస్ అండ్ పీ చెబుతున్న కారణాలివీ..
1. ఆర్థిక సంస్కరణలను చేపట్టడానికి కేంద్రం వద్ద బలం లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే విషయంలో విధానపరమైన పక్షవాతానికి గురైంది. విమాన, రిటైల్ రంగాల్లో ఎఫ్ ఢిఐ ఆమోదం పింఛను సంస్కరణల బిల్లు, ప్రత్యక్ష పన్నుల , జీఎస్ టీ వంటి సంస్కరణలు కదలడం లేదు.
2. మందగిస్తున్న వ్రుధ్ది , రాజకీయ కారణాల వల్ల ఆగిన సంస్కరణలు వ్రుద్దిని మందగమనం బాట పట్టిస్తున్నాయి.
3. మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతింటోంది. గనులు, టెలికమ్యూనికేషన్లు , చమురు-గ్యాస్, భూ సేకరణ వంటి ప్రధాన రంగాల్లో పెచ్చుమీరుతున్న అవినీతి వారిని భయపెడుతోంది. ప్రజలు కూడా ప్రభుత్వ విధానాల పట్ల విముఖత చూపిస్తున్నారు.
4. జనరల్ యాంటి అవాయిడెన్స్ రూల్స్ ( గార్) ను సమీక్షిస్తుండడం కూడా విదేశీ మదుపర్లకు గొడ్డలిపెట్టుగా ఉంది. దీని ప్రభావంతో మూడు నెలల్లోనే విదేశీ మదుపర్లు పార్టిసి పేటరీ నోట్స్ (పీ నోట్లు ) ద్వారా దాదాపు రూ. లక్ష కోట్ల పెట్టుబడులను భారత్ నుంచి వెనక్కి తీసుకున్నారు.
5. ఇటీవలి ఆర్థిక పరిణామాలు భారత వ్రుధ్దిని ప్రమాదంలోకి నెడుతున్నాయి. అధిక స్థాయి విదేశీ మారక నిల్వలు భారత సావరిన్ రేటింగ్ కు మద్దతు పలుకుతుండగా.. అధిక ద్రవ్య లోటు , రుణ భారం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more