రాష్ట్రంలో 18 నియోజక వర్గాలలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. తమ తమ పార్టీలకు గెలిపించుకోవటానికి రాజకీయ పార్టీలు , రాజకీయ నాయకులు ఓటర్లకు గాలం వేసే పని లో బిజీగా ఉన్నారు. గతంలో ఓటు కోసం మందు, బిర్యాణి ఇచ్చిన నాయకులకు ఓట్లు రాలేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరుగా ఉంటుందట. ఆడ , మగ అనే భేదంతో ఓట్లు డివైట్ చేసినట్లు తెలుస్తుంది. మగ వారికి డబ్బులు , మందు , ఇంక వారు కోరిన కోరికలను రాజకీయ నాయకులు తీర్చుతున్నారట. ఆడవాళ్ళకి మాత్రం , ముక్కుపుటకలు , కాళ్లకు పట్టీలు, చీరలు , ఉప ఎన్నికల్లో రాజకీయ నాయకులు పంచుతున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి.
రాష్ట్రం లో ఉన్న ప్రధాన పార్టీలతో పాటు లోకల్ పార్టీ కూడా పోటీ పడి డబ్బులు పంచుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఉప ఎన్నికల పంచే డబ్బుకు లేకలేకుండా పోతుంది. డబ్బును నీళ్లలా వాడుతున్నారని మీడియా వార్గలు అంటున్నాయి. ఇప్పటికే ఉప ఎన్నికల్లో పోలీసులకు చిక్కిన డబ్బు 50, 60 కోట్లు దాటిందని మీడియా వర్గాలు అంటున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక గ్రామం ఓటు కు – డబ్బు ను తిరస్కారించినట్లు రాజకీయ నాయకులు అంటున్నారు,
విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజక వర్గంలో సీతారాంపురం గ్రామస్థుల మాత్రం ఓటుకు డబ్బులు తీసుకోవటం నేరంగా భావిస్తున్నారట. అంతేకాకుండా మీరిచ్చే నోటు కోసం మా తల తాకట్టు పెట్టం.. మీ పాపాల్లో మమ్మల్ని భాగస్వాముల్ని చేయకండి.. అంటూ ఆ గ్రామస్థులంతా ఒక్క తాటిపై నిలిచినట్లు రాజకీయ నాయకులు అంటున్నారు. పాయకరావు పేటలో డబ్బు పంచేందుకు వెళ్లిన ఒక పార్టీ నాయకులను వెనక్కి పంపి ఆదర్శంగా నిలిచారట. ఈ ఊరిలో దాదాపు వెయ్యి మంది జనాబా, 700 కు పై ఓటర్లున్నట్లు తెలుస్తుంది.
వైఎస్స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు గ్రామంలో డబ్బులు పంచేందుకు రాగా వారిని మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఉరుకుట్ల వెంకటరమణ ఆధ్వర్యంలో గ్రామస్థులంతా కలిసి నిలువరించి వెనక్కు పంపినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. ఓట్ల కోసం తమ గ్రామంలో డబ్బు పంపిణీ చేస్తే సంహించబోమని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇతరులకు ఆదర్శంగా నిలిచి, నిజాయితీకి పట్టం కట్టాలన్నదే తమ ధ్యేయమంటున్నారు గ్రామస్థులు. ఓటుకు సొమ్ములు తీసుకునే పద్దతి తమ పిల్లలకు అంటించబోమన్నారు. డబ్బు పంపిణి చేసే పార్టీలకు వ్యతిరేకంగా ఓటేస్తామని స్పష్టంగా చెబుతున్నారట. గ్రామస్థులంతా ఓటు కోసం ఎవరు డబ్బు ఇచ్చినా తీసుకోమని ప్రమాణం చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రజలు అందురు సీతారంపురం ప్రజలను ఆదర్శంగా తీసుకుంటే.. రాష్ట్రంలో అవినీతి అనేది ఉండదని సీతారంపురం ప్రజలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more