తప్పు చేసిన కొడుకును ఏ తండ్రైన కాపాడటం మనకు తెలుసు. కానీ అదే తండ్రి న్యాయం కోసం తన సొంత కొడుకును కోర్టు బోను నిలబెట్టిన తండ్రి ఒకరున్నారు. ఆయనే పాకిస్థాన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ ఇప్తికార్ చౌదరి. న్యాయదేవత ముందు అందరూ సమానులే. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం న్యాయం ముందు పనిచేయవని మరోమారు రుజువైంది. కన్న కొడుకు కంటే న్యాయమే మిన్న అని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇఫ్తికార్ చౌదరి తన చర్య ద్వారా నిరూపిస్తున్నారు.. కొడుకు అర్సలాన్ చౌదరిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఒక తండ్రిగా కాక న్యామూర్తిగా స్పందించి చట్టపరమైన చర్యలకు తీసుకుంటున్నారు. సుమోటోగా కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయటం జరిగిందట. సుప్రీంకోర్టులో కేసులను తన పలుకుబడితో ప్రభావితం చేయడానికి వీలుగా.. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాలిక్ రియాజ్ హుస్సేన్ నుంచి అర్సలాన్ చౌదరి రూ.40కోట్లు పుచ్చుకున్నారంటూ పలు టీవీ చానళ్లలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయాట. దీంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇఫ్తికార్ చౌదరి ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఎదుట ఈ కేసులో వాదనలు మొదలయ్యాయి.
దర్మాసనంలో జస్టిస్ ఇఫ్తికార్ చౌదరి ఉండడంపై అటార్నీ జనరల్ ఇర్ఫాన్ ఖాదిర్ అభ్యంతరం వ్యకం చేశారట. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఇఫ్తికార్ కోర్టు గౌరవానికి భంగం కలిగించిన వారిలో తన కుమారుడు సహా ఎవరున్నా సరే వదిలేది లేదని ప్రమాణ పూర్వకంగా చెప్పారు. తన కొడుకుపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే చట్టప్రకారం శిక్షించబడతాడని ఆయన చెబుతున్నారు. సుప్రీం కోర్టు చేపట్టిన సుమోటో కేసులో తన ప్రమేయం లేదని ప్రధాన న్యాయమూర్తి కుమారుడు అర్సలన్ ఇఫ్తికార్ అన్నారు. విచారణ ప్రారంభమయ్యే సమయానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఇంటి గుమ్మం తొక్కవద్దని తన తండ్రి (ప్రధాన న్యాయమూర్తి) ఆజ్ఞాపించారని వాపోయారు. మరోపక్క కేసుకు సంబంధించి రియల్ ఎస్టేట్ దిగ్గజం హుస్సేన్ కోర్టుకు డుమ్మా కొట్టి, తన లాయర్‌ను పంపారు. రియల్ ఎస్టేట్ దందాలు, భూ కబ్జాలకు సంబంధించి హుస్సేన్‌పై సుప్రీం కోర్టులో పలు కేసులు ఉండడం గమనార్హం.
పాకిస్టాన్ లో ఇలా జరుగుతుంటే.. ఇండియాలో మాత్రం దాని విరుద్దంగా జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. ఉదాహరణకు . ఆంద్రప్రదేశ్ రాష్ట్రం. లక్ష కోట్లు అవినీతి, అక్రమమంగా ,సంపాదించాడు అని జగన్ పై వచ్చిన ఆరోపణలను రుజువు చేసుకోకుండా.. కాంగ్రెస్ పార్టీ కుట్రతో జగన్ అరెస్ట్ జరిగిందని తల్లి అయిన విజయమ్మ ఒక్కసారి ఈ విషయం తెలుసుకోవాలి. చట్టం ముందు అందరు సమానులే అనే విషయం విజయమ్మ గుర్తు తెచ్చుకోవాలని.. ప్రజలు అంటున్నారు. విజయమ్మ తన కొడుకు కు మద్దతు పలుకుతూ , తను చేసే అవినీతిలో భాగం పంచుకుంటున్నారని సామాన్యా ప్రజలు అంటున్నారు. ఇకనైనా నిజాయితీ జగన్ చేసిన తప్పులు ఒప్పుకోవాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారని మీడియ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more