Chegondi harirama jogaiah

chegondi harirama jogaiah,Chegondi harirama jogaiah Political Style, Chegondi harirama jogaiah Political Game,Political Game of Chegondi harirama jogaiah, Chegondi, YS Jagan, Congress Party, Arrest, diksha,

chegondi harirama jogaiah

chegondi.gif

Posted: 05/25/2012 09:19 PM IST
Chegondi harirama jogaiah

chegondi harirama jogaiah

ముసలి వయస్సులో .. సీనియర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు  మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య.   రామయ్య ఉన్న ఏపార్టీలోనైన.. ఆ పార్టీ నాయకుడిపై విమర్శలు చేయటం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య.  అలాంటి రామయ్య  ప్రస్తుతం ఉన్న పార్టీ నాయకుడి కోసం  ఆమరణ దీక్ష చేస్తానని  మీడియా ప్రకటనలు చేస్తున్నాడట.  అంతేకాకుండా ప్రభుత్వవానికి  అల్టిమేటం ఇస్తున్నాడని  అధికార రాజకీయ నాయకులు అంటున్నారు. 

గతంలో  పిఆర్పీ పార్టీ లో ఉన్నా జోగయ్య   చిరంజీవి పైనే విమర్శలు చేయటం జరిగింది.  అలాగే  అప్పటి  ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై లేఖల హస్త్రం ప్రయోగించిన  వ్యక్తి జోగయ్య.   రాజశేఖర్ చేపట్టిన జలయాజ్నం ప్రాజెక్టు  పై జోగయ్య  రాతలు ఘోరంగా ఉండేవని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు .  రాజశేఖర్ చేపట్టిన జలయజ్నం కాదు ధనయజ్నం అని వందల లేఖలు  రాజశేఖర్ పై సంధించటం జరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు .

 అలాంటి అవినీతి  నాయకుడు కొడుకు పార్టీ పెడితే .. ఆ పార్టీలో చేరిన  జోగయ్య .. లక్ష కోట్లు అక్రమంగా సంపాదించిన  జగన్ కు మద్దతుగా ఉండటమే కాకుండా .. జగన్ ను అరెస్ట్ చేస్తే .. ముసలి వయస్సులో  ఉన్న జోగయ్య ఆమరణ దీక్ష చేస్తానని ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వటం చాలా విచిత్రంగా ఉందని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు .

జోగయ్య చూడపోతే.. సూరిని చంపిన భాను కోసం, మంగలి క్రిష్ణ కోసం,  గాలి  కోసం,  ఆమరణ దీక్ష చేస్తాడేమోనని  కాంగ్రెస్ నాయకులు  గాంధీ భవన్ లో  జోకులు వేసుకుంటున్నారు.  అంతేకాకుండా  పార్లమెంట్ పై దాడి చేసిన అప్జల్ గురు కు మద్దతుగా జోగయ్య ఆమరణ దీక్ష చేసిన చేస్తారని కాంగ్రెస్ నాయకులు జోకులు వేసుకుంటున్నారు .  ఇలాంటి ముసలి  నాయకులు రెచ్చిపోకుండా .. ఆమరణ దీక్ష చేసిన  ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండాలి. అప్పుడు ఒక్క రోజుకే  వీరి బండరం తెలుస్తుందని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  అంతేకాకుండా.. ఆమరణ దీక్ష లో కుర్చోన్నా సమయం  నుండే  .. పోలీసులకు ఒకటే ఫోన్ చేస్తుంటారు .. మీరు త్వరగా వచ్చి నన్ను అరెస్ట్ చేయాండని ఫోన్లుతో  పోలీసులను విసుగిస్తుంటారు జోగయ్యలాంటి ముసలి నాయకులు.  జోగయ్య కనుక ఒక వారం రోజులో  పాటు ఆమరణ దీక్ష చేస్తే ..మాత్రం  జగన్ జైలు నుండి బయటికి వచ్చి జోగయ్య ఫోటోకు దండ వేసి .. ఓదార్పు యాత్ర చేస్తారనే జోకులు గాంధీ భవన్ పేలుతున్నాయాని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నవ్వుకుంటు చెబుతున్నారు .

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నికల ముందు ఏ రోజు అరెస్టు చేసినా తాను ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని మాజీ మంత్రి, ఆ పార్టీ నేత చేగొండి హరిరామ జోగయ్య ప్రకటించారు. ఉప ఎన్నికలు జరుగుతున్న ఒక పార్లమెంట్, 18 అసెంబ్లీ స్థానాల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ప్రచారం చేయనీయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.

సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే సత్తాలేక దొడ్డిదారులు వెతుకుతున్నాయని పేర్కొన్నారు. ‘కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో జగన్ లక్షల మెజార్టీతో నెగ్గారు. కోవూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు డబ్బులు వెదజల్లినా, జగన్ 25 వేల ఓట్లకుపైగా మెజార్టీతో తన పార్టీని గెలిపించిన తీరు చూస్తుంటే ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల ఎంత అభిమానం చూపిస్తున్నారో అర్థమవుతోంది. ప్రస్తుత ఉప ఎన్నికల్లో నెగ్గేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ తొక్కుతున్న అడ్డదారులను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ‘సాక్షి’ మీడియా పీక నొక్కితే జగన్ గొంతు జనానికి వినపడదనే దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ హైకమాండ్ సీబీఐతో డ్రామాలు ఆడిస్తోంది’ అని జోగయ్య పేర్కొన్నారు. ‘సాక్షి’ మీడియా గొంతు నొక్కి ఆయనను కట్టడి చేద్దామని ప్రయత్నించిన వారికి హైకోర్టు తీర్పు అడ్డంకిగా మారిందని జోగయ్య అంటున్నారు . 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shilpa shetty and raj kundras baby boy
Tdp suspends mysura reddy for proximity with jagan mohan reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more