జగన్ ఆస్తుల కేసులో హైకోర్టు ఆదేశానుసారం సిబిఐ చేపట్టిన విచారణ కీలక దశకు చేరటంతో, కేసుతో సంబంధం ఉన్న సీనియర్ ఐఏఎస్‌లు, మంత్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. విచారణకు హాజరు కావాలంటూ ఇటీవలే సమన్లు అందుకున్న రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ దిల్‌కుషాలో సిబిఐ విచారణకు హాజరవుతున్నారు. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ విచారణ ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్యూరోక్రాట్లు, మంత్రులు, పారిశ్రామిక వేత్తలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వాన్‌పిక్ ప్రాజెక్టు అధినేత, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేసే ముందు జరిపిన విచారణలో మంత్రి మోపిదేవి పాత్ర గురించి వారు వివరించడంతో, మోపిదేవిపై సిబిఐ దృష్టి పెట్టింది.
ఇలావుంటే, త్వరలో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావులను సిబిఐ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరుకూడా వైఎస్ హయాంలో పలు జీవోలను జారీ చేయడంలో కీలకపాత్ర వహించారని సిబిఐ భావిస్తున్న నేపథ్యంలో, వీరినీ విచారించే అవకాశం ఉంది. మంత్రుల పరిస్థితి ఇలావుంటే, పారిశ్రామికవేత్తలపైనా ఇప్పుడు ఫోకస్ పెంచింది. ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొంది, జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వైనంపై సిబిఐ వారిపై విచారణ ముమ్మరం చేసింది. ఈ కోణంలో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డను జైలుకు పంపారు. ఇదే వరుసలో మరికొందరు పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని తెలుస్తోంది. కేసులో సిబిఐ ఏ1గా పేర్కొంటున్న జగన్ అరెస్టుకు ముందే మరికొందరు పారిశ్రామికవేత్తలు అరెస్టు అయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు. పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్‌రెడ్డి, మరోపారిశ్రామికవేత్త పి.వరప్రసాద్, రామ్‌కీ గ్రూప్ చైర్మన్ అయోధ్యరామిరెడ్డిలను ఇప్పటికే సిబిఐ విచారించింది. విశాఖ ఫార్మాసిటీ పేరుతో నిబంధనలను అతిక్రమించి అప్పట్లో వైఎస్ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించడం వల్ల రామ్‌కీ పొందిన లబ్దికి ప్రతిఫలంగా భారీఎత్తున జగన్ సంస్థల్లో పెట్టుబడులు ప్రవహించినట్టు సిబిఐ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఇదేవిధంగా పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, మరికొన్ని కంపెనీలు జగన్ సంస్థల్లో పెట్టుబడుల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో విచారణ దాదాపు పూర్తి చేసిన సిబిఐ, బాధ్యులైన పారిశ్రామిక వేత్తలు ఒక్కొక్కరినీ అరెస్టు చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
కాగా, సిబిఐ దూకుడును జగన్ కార్పొరేట్ వర్గం నిలువరించే పనిలో ఉంది. జగన్ కంపెనీల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అడ్డుకుని స్టే తెచ్చుకునేందుకు న్యాయపోరాటం ఆరంభించింది. ఈమేరకు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు విచారించనుంది. మరోవైపు సిబిఐ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అటాచ్‌మెంట్ జీవోలను కోర్టుకు సమర్పించి అందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more