గబ్బర్ సింగ్ కు ప్రశంసల జల్లు కురిపించిన వారి జాబితాలో ఎక్కడా రామ్ చరణ్ పేరు లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఈలోగా ... వారి మధ్య మనస్పర్థల కారణంగానే చరణ్ ఇంతవరకూ ఈ సినిమా పై ఎలాంటి కామెంటూ చేయలేదనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పుడా వార్తలకి ఫుల్ స్టాప్ పెడుతూ, చరణ్ ఈ సినిమాపై స్పందించాడు. 'గబ్బర్ సింగ్' చిత్రం అదుర్స్ అనిపించేలా ఉందనీ ... నిజంగా ఈ సినిమా ప్రేక్షకులకి ఓ పండుగ లాంటిదని ట్వీట్ చేశాడు. విదేశాల నుంచి రాగానే ఈ సినిమా చూశాననీ ... ఈ సినిమా సక్సెస్ లో పాలు పంచుకున్న వారందరికీ అభినందనలు అందజేస్తున్నానంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దాంతో ఇప్పుడు మెగా అభిమానులంతా యమా ఖుషీ అయిపోతున్నట్టు తెలుస్తోంది.
గబ్బర్ సింగ్' చిత్రం విడుదలై తొలి రోజునే హిట్ టాక్ ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు ఈ సినిమా సక్సెస్ పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. దాసరి నారాయణ రావు ... రామ్ గోపాల్ వర్మ ... రామానాయుడు ... త్రివిక్రం శ్రీనివాస్ ... అక్కినేని అఖిల్ ... సిద్ధార్థ్ ఇలా అందరూ కూడా ఈ సినిమా పట్ల తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ, పవన్ కళ్యాన్ తో పాటు దర్శక నిర్మాతలకి అభినందనలు అందజేశారు. ఈ సినిమాలో పవన్ చూపిన స్టైలు ... చెప్పిన డైలాగులు ... చేసిన డాన్సులు ... అభిమానులని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధిస్తుందని భావించిన పవన్ అభిమానులు సంతోషంతో సంబరాలు జరుపుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more