ఫెయిర్ అండ్ లవ్లీ, రాజ్‌కుమార్ సిల్క్, శరవణన్ స్టోర్స్, శక్తిమసాలా వంటి వాణిజ్య ప్రకటనలలో మోడలింగ్ చేసుకుంటూ... మరో పక్క పదోతరగతి పరీక్షలు రాసి రిజల్ట్‌స కోసం ఎదురుచూస్తున్న తమన్నాకు మోహన్‌బాబు సంస్థలో మనోజ్‌కుమార్ హీరోగా చేస్తున్న చిత్రంలో తొలి అవకాశం వచ్చింది.
ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ చిత్రం తర్వాత తమన్నా ఇక వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు తెరకు తాత్కాలికంగా రెండు సంవత్సరాలు దూరం అయినా ఆ రెండు సంవత్సరాలలో తమిళ సినిమాలలో బిజీ అయిపోయింది. అందుకే తమన్నా అంటే ఇప్పుడు తెలుగు, తమిళ రంగాల ప్రేక్షకులకు తరగని క్రేజ్.తెలుగులో లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా తన బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకుని పాత్ర పరిధిమేరకు నటిస్తూ అవసరమున్నంతలో అడపాదడపా అందాలను ఆరబోస్తూ తెలుగు ప్రేక్షకులకే కాదు...ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోలనుంచి అప్ కమింగ్ హీరోల దాకా తమన్నా కోసం తహతహలాడుతున్నారు. గత సంవత్సరం తమన్నా బధ్రీనాధ్, 100%లవ్, ఊసరవెల్లి చిత్రాలలో నటించింది. మూడూ వేటికవే ప్రత్యేకత కలిగినవి కావడంతో తమన్నాకు కలిసి వచ్చింది. ఇక ఈ సంవత్సరం లేటెస్ట్‌గా ‘రచ్చ’ సినిమాతో తన స్టామినా ఏమిటో రుజువుచేసుకుంది. ‘రచ్చ’ ఆడియో ఫంక్షన్లో సైతం స్వయంగా చిరంజీవి తమన్నా ఒప్పుకుంటే తాను 150వ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవడానికి సిద్ధం అని ప్రకటించారు.
ఇప్పుడు తమిళ హీరోలకు సైతం తమన్నానే కావలసి వస్తోంది. తమన్నాకు టాలీవుడ్, కోలీవుడ్‌లో ఉన్న డిమాండ్‌ను బట్టి అక్కడి హీరోలు కూడా తమన్నాయే తమకు కావాలని పట్టుబట్టడం విశేషం. తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే తమిళ మార్కెట్‌పై కన్నేసిన మన హీరోలు తమన్నాను అడ్డం పెట్టుకుని తమిళ మార్కెట్‌ను కొల్లగొట్టేయాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఏదో నేర్చుకొని నేను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు. ఇన్నేళ్లుగా ఇక్కడ ఉన్నాను కాబట్టి అంతా నేర్చేసుకొన్నట్టూ కాదు. ఇంకా ఎంతకాలం నటించినా తెలుసుకోవల్సింది కొంత మిగిలే ఉంటుందని చెబుతోంది తమన్నా. ఇటీవలే రామ్ చరణ్ తో కలిసి రచ్చ చేసింది. ‘వానా వానా వెల్లువాయె’ పాటలో తమన్నా అందాలను ఆరబోసింది. తమన్నా కేరీర్ లో ఒక్కో సినిమా నుంచి ఒక్కో విషయం నేర్చుకొంటుందట. ఒక్కో హీరో దగ్గర నుంచి తమన్నాకు తెలియని కొత్త పాఠాన్ని తెలుసుకుంటుందని తమన్నా చెబుతుంది.
అల్లు అర్జున్ తో కలిసి బద్రినాథ్ లో నటించినప్పుడు బన్నీ దగ్గ డ్యాన్స్ లు బాగా నేర్చుకుందట. అలాగే డ్యాన్స్ కు సంబంధించిన కొన్ని చిట్కాలు చెప్పాడని చెబుతుంది. ఆ చిట్కాలు తమన్నాకు చాలా మేలు చేసాయాని అంటుంది. రామ్ చరణ్ తో రచ్చ సినిమా చేసేటప్పుడు బన్నీ చెప్పిన చిట్కాలను ఆచరణలో పెట్టానని చెబుతుంది. అలాగే కెమెరా ముందు సంభాషణ ఎలా చెప్పాలో ఎన్టీఆర్ నుంచి గ్రహించిందట. డ్యాన్స్ లోని గానీ, నటనలో గానీ రామ్ చరణ్ శైలి వేరు. రామ్ చరణ్ దగ్గర కొన్ని విషయాలు గమనించానని చెబుతుంది తమన్నా. త్వరలో పవన్ కళ్యాణ్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇక పవన్ కళ్యాణ్ చాలా నేర్చుకోవాలని తెల్ల పిల్ల నవ్వుతూ సమాధానం చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more