దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చివరి నిమిషం దాకా తోడుగా ఉన్న కంభంపల్లి సూర్యనారాయణ రెడ్డి ఉరఫ్ సూరీడును సీబీఐ రంగంలోకి దింపింది. వైఎస్ మరణానంతరం ఆ కుటుంబానికి పూర్తిగా దూరంగా ఉంటున్న ఆయనను వైఎస్ జగన్ ఆస్తుల కేసులో సాక్షిగా సీబీఐ తెరపైకి తీసుకువచ్చింది. నాంపల్లి సీబీఐ కోర్టునుంచి సూరీడును ప్రశ్నించేందుకు కొద్దిరోజుల క్రితమే అనుమతి పొందిన సీబీఐ చివరి నిమిషం వరకూ ఆ విషయం పూర్తిస్థాయిలో గోప్యంగా ఉంచింది. సూరీడు సీబీఐ కార్యాలయానికి వచ్చేంత వరకూ మీడియాకు కూడా ఈ విషయం తెలియదు.
దాదాపు మూడున్నర గంటల పాటు ఆయనను ప్రశ్నించిన సీబీఐ అధికారులు సిఆర్‌పిసి 168 ప్రకారం అతడి వాగ్మూలాన్ని రికార్డు చేయాలని నిర్ణయించి ఆమేరకు నాంపల్లి సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దానిని పరిశీలించిన అనంతరం మెజిస్ట్రేట్ అనుమతి మంజూరు చేశారు. దాంతో బుధ, గురువారాలలో సూరీడును మరోమారు మెజిస్ట్రేట్ సమక్షంలో విచారించి జగన్ ఆస్తులకు సంబంధించి కీలక ప్రశ్నలకు అతడినుంచి సమాధానం రాబట్టి వాటిని రికార్డు చేయాలని నిర్ణయించారు. సుదీర్ఘకాలం వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడిగా ఉన్న సూరీడు ఒక విధంగా వైఎస్ నీడ అంటూ పేరు తెచ్చుకున్నాడు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా అధికారులు ప్రోటోకాల్ ప్రకారం వ్యక్తిగత మనుషులు (కుటుంబ సభ్యులు తప్ప) సీఎంకు అతిదగ్గరగా ఉండేందుకు వీలులేదంటూ అభ్యంతరం పెట్టడంతో వైఎస్ సూరీడును ఓఎస్‌డి (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా అధికారికంగా నియమించుకున్నారు.
ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎంత కీలక అంశాలపై అధికారిక సమీక్షలు జరిగినా, సమావేశాలు జరిగినా, ఎలాంటి రహస్య సమాలోచనలు జరిగినా మిగిలిన వారెవ్వరు ఉన్నా లేకున్నా సూరీడు మాత్రం వైఎస్ వెన్నంటే, ఆయన వెనుకనే ఉండేవారు. వైఎస్ మరణించిన తరువాత కేవలం కొద్దిరోజులు మాత్రమే వైఎస్ సతీమణి విజయలక్ష్మి వెంట, జగన్ వెంట ఉన్న సూరీడు హఠాత్తుగా తెరమరుగైపోయాడు. ఒకవేళ ఎవరైనా నేరుగా వైయస్‌ను కలిసినా ఆయన కెవిపితో మాట్లాడమని పంపేవారని సూరి తన వాంగ్మూలంలో వివరించాడు. రాజశేఖర రెడ్డి ఇంట్లో ఖర్చులకు అవసరమైన రూ.లక్షలను సునీర్ రెడ్డి తెచ్చి ఇచ్చేవాడని, ట్రైమెక్స్ ప్రసాద్ అనేకసార్లు దుబాయ్ నుంచి వచ్చి తెల్లవారుజామున వైయస్‌ను కలిసేవారని వెల్లడించాడని తెలుస్తోంది. 1977 నుంచి తాను వైయస్ మరణించే వరకు ఆయనతోనే ఉన్నానని చెప్పారని సమాచారం.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గురించి ఆయన ఆత్మబంధువు కెవిపి రామచంద్ర రావు గురించి వైయస్ వ్యక్తిగత సహాయకుడు సూరీడు ఎన్నో విషయాలు సిబిఐకి వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వారికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సూరీడు సిబిఐ ముందు ఉంచాడని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందాలనుకునే వారు ముందుగా కెవిపి రామచంద్ర రావును కలిసిన తర్వాతే వైయస్‌ను కలిసేవారని సూరీడు సిబిఐ ఎదుట చెప్పారని తెలుస్తోంది. వైయస్‌కు కెవిపి ఆప్తమిత్రుడని, కెవిపి సలహా లేకుండా ఏ పనీ చేసే వారు కాదని, 2004లో వైయస్ సిఎం అయ్యాక ఆయన్ను సలహాదారుగా నియమించారని, ప్రభుత్వం ద్వారా ఎవరికైనా లబ్ధి జరగాలంటే మొదట కెవిపినే కలిసేవారని, వైయస్ ఇంటికి విఐపిలు, విదేశీ అతిథులు వచ్చినా ఆయన తప్పక ఉండేవారన్నారు. వైయస్ కుటుంబానికి ట్రైమెక్స్ ప్రసాద్ ఎప్పటి నుంచో పరిచయమని, రాజారెడ్డితో వ్యాపార సంబంధముండేదని, వైయస్ సిఎం అయ్యాక ప్రసాద్, కెవిపిలు పలుసార్లు కలిశారని ఆయన చెప్పారట.
అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయన అటు జగన్‌తో కాని, ఆయన శిబిరంలోకాని, ఇటు ఇడుపులపాయలో కాని, విజయలక్ష్మి వెంట ఇలా ఎక్కడా కనిపించడం లేదు. అలాంటి సూరీడును హఠాత్తుగా తెరపైకి తీసుకురావడం, అది కూడా జగన్ ఆస్తుల కేసులో అతడిని సాక్షిగా ప్రకటించడంతో జగన్ వర్గంలో ఒకింత కలవరానికి గురిచేసిందనే చెప్పవచ్చు. కాగా మంగళవారం నాటి విచారణలో సీబీఐ ఏ సమాచారం సేకరించింది అన్నదానిపై అధికారులెవ్వరూ నోరుమెదపడం లేదు. కాగా జగన్ ఆస్తుల కేసులో వాంగ్మూలం ఇచ్చిన సూరీడును సిబిఐ అధికారులు మెజిస్ట్రీట్ ముందు హాజరు పర్చే అవకాశముంది. సూరీడు కీలక సమాచారాన్ని వెల్లడించడంతో ఇదే విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు సూరిడు నుంచి వాంగ్మూలం తీసుకోవాలని సిబిఐ భావిస్తోంది. ఇందుకోసం కోర్టు నుంచి అనుమతి కూడా పొందింది. దిల్ కుషా గెస్టు హౌస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more