అంతర్జాతీయ క్రికెట్లో బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్ నేడు 39వ ఏట అడుగుపెట్టాడు. మాస్టర్ వందో సెంచరీ సాధించినతర్వాత జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు కావటంతో ఈరోజును మతాలు, సాంప్రదాయాలను ప్రక్కన పెట్టి అందరూ ఒక పండుగలా జరుపుకుంటున్నారు. ఆఫీసుల్లో సైతం కేక్స్ కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ మాస్టర్ బ్లాస్టర్ కు విషస్ చెబుతున్నారు.
అయితే సచిన్ మాత్రం తన పుట్టిన రోజును సాదాసీదాగానే జరుపుకుంటున్నాడు. పంజాబ్‌తో బుధవారం జరగనున్న మ్యాచ్‌కోసం సచిన్.. భార్య అంజలితో కలిసి నిన్న మధ్యాహ్నం పంజాబ్ చేరుకున్నాడు. వీరి వెంట పిల్లలు సారా, అర్జున్‌లు మాత్రం రాలేదు. తొలుత సచిన్ బర్త్ డే వేడుకలు ఘనంగా చేయాలనుకున్నప్పటికీ.. కార్యక్రమాన్ని సింపుల్‌గానే ముగించాలని నిర్ణయించారు. ఆటగాళ్లు బస చేసిన హోటల్‌లో ఏర్పాటు చేసిన బర్త్ డే కార్యక్రమానికి ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీతో పాటు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు.
సచిన్ దిగ్గజాల నీడలోనే తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ టైంలో సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్‌ల హవా క్రికెట్‌పై ఎంతో ఉంది. సిద్దు, సంజయ్‌మంజ్రేకర్, అజహరుద్దీన్, రవిశాస్త్రి లాంటి కీలక ప్లేయర్లు అప్పటికే జట్టులో ఉన్నారు. వారందరి నీడలోనే ఎదుగుతూ.. టీంలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని రిజర్వ్ చేసుకోగలిగాడు సచిన్ టెండూల్కర్. మాస్టర్ తన తొలి టెస్టు సిరీస్‌లోనే తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు బాటలు వేసుకున్నాడు. సియాల్‌కోట్ టెస్ట్ మ్యాచ్‌లో వకార్ యూనిస్ వేసిన బంతి ముక్కుకు తగిలి రక్తం కారుతున్నా.. క్రీజ్ వదలకుండా 57 పరుగులు చేశాడు. ప్రత్యర్థిని ఎంత ధృడంగా ఎదుర్కోగలనో ఆనాడే చాటిచెప్పాడు. స్కూల్‌డేస్‌లో తన మిత్రుడు వినోద్ కాంబ్లీతో కలిసి.. 664 పరుగుల అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ రికార్డు తర్వాతే.. ముంబైలో క్రికెటర్లకు అతనేంటో తెలిసింది. అప్పటికి సచిన్ వయస్సు 15 ఏళ్లు. అప్పట్లో సచిన్‌ను అంతా తెండిల్యా అంటూ ముద్దుగా పిలిచేవారు. జాతీయ స్థాయికి క్రికెట్ కోసం గ్రౌండ్‌లో అడుగుపెట్టిన సచిన్ తొలిమ్యాచ్‌లోనే సెంచరీ కొట్టాడు. అంతేకాదు.. దేశీయ క్రికెట్‌లో అత్యున్నత టోర్నీలైన రంజీట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు. నవంబర్ 15, 1989న ఇలా తొలిసారి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు టెండూల్కర్. అప్పటికి అతని వయస్సు 16 సంవత్సరాలు. రెండు దశాబ్దాల పైబడి సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో విమర్శలను మౌనంగా భరిస్తూ వచ్చిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్, ఇప్పుడు ఘాటైన మాటలతో ధీటైన సమాధానాలిస్తున్నాడు. తన విమర్శకులకు ఎప్పుడూ బ్యాటుతో సమాధానం చెప్పే మాస్టర్, ఈ సారి నోటితో కూడా జవాబు చెబుతున్నాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమంటున్నాడు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని అంటున్నారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు పచ్చటి చెట్లు పెంచాలని పిలుపునిస్తున్నారు. ఇందులో భాగంగా పుణె సిటీలో మొక్కలు నాటే కార్యక్రమంలో సచిన్ విస్త్రుతంగా పాల్గొన్నారు. వినయం విధేయత తో తను అనుకున్న లక్ష్యాన్ని అలవోకగా చేరిన సచిన్ నేటి యువతకే కాదు పెద్దలకీ ఆదర్శప్రాయుడయ్యాడు. ఈ శుభసమయాన క్రికెట్ మహారాజుకు ఆంధ్రా విశేష్.కాం పుట్టిన రోజు శుభాకాంక్షలు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more