సుబ్బిరామి రెడ్డి తన పోటీని దృష్టిలో పెట్టుకునే ఇటీవల నెల్లూరుకు వెళ్లారు. ఆయన నెల్లూరుకు చెందినవారే. ఆయితే, చాలా కాలంగా విశాఖపట్నం జిల్లా రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం లోకసభ స్థానానికి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ఆయన కొద్ది కాలంగా చెబుతూ వస్తున్నారు. అయితే, కాంగ్రెసు పార్టీ అధిష్టానం మరో విధంగా ఆలోచించింది. నెల్లూరు నుంచి మేకపాటిపై సుబ్బిరామిరెడ్డిని బరిలోకి దింపుతోంది. నెల్లూరు లోకసభ స్థానానికి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా టి. సుబ్బిరామిరెడ్డి పేరు ఖరారైంది. టి. సుబ్బిరామిరెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. భేటీ అనంతరం ఆయన నెల్లూరు లోకసభ స్థానానికి తన పేరు ఖరారైనట్లు ఆయన ధ్రువీకరించారు. నెల్లూరు నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీ ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
తనకు సుదీర్ఘ రాజకీయానుభవం ఉందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో జయాపజయాలు సహజమేనని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే మేకపాటి రాజమోహన్ రెడ్డి తనకు మిత్రుడేనని ఆయన అన్నారు. రాజమోహన్ రెడ్డి నెల్లూరు లోకసభ స్థానానికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. దాంతో నెల్లూరు లోకసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. మేకపాటిపై కాంగ్రెసు పార్టీ టి. సుబ్బిరామిరెడ్డిని పోటీకి దింపడం ఖాయమైంది.నిజానికి, మాజీ ముఖ్యమంత్రి నేదరుమల్లి జనార్దన్ రెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ఆయన ఆరోగ్యం సహకరించేట్లు లేదు. దీంతో అధిష్టానం టి. సుబ్బిరామిరెడ్డి అభ్యర్థిత్వానికి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కాంగ్రెసులో రెండు గ్రూపులు ఉండడంతో ఇరు గ్రూపుల మద్దతు పొందడానికే టి. సుబ్బిరామిరెడ్డిని రంగంలోకి దింపినట్లు అనుకోవచ్చు
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more