విజయ సాయి రెడ్డి తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లారు. ఇదే హోటల్‌లో వాయలార్ రవి, మంత్రి శరద్ పవార్ బస చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అరెస్టైన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి కేంద్ర మంత్రి శరద్ పవార్‌ను, కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలనకు వచ్చిన వాయలార్ రవిని కలిశారా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో విజయ సాయి వారిని కలిసేందుకే వెళ్లారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ ఆస్తుల కేసులో ఎ-2గా ఉన్న విజయ సాయి రెడ్డి కాంగ్రెసు నేతలు, కేంద్ర మంత్రి బస చేసిన తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. వేకువజామునే అక్కడకు వెళ్లడం వెనుక లాలూచీ ఏమిటో చెప్పాలని టిడిపి నేతలు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ డిమాండ్ చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని మంచివాడు అన్న వాయలార్ రవి వ్యాఖ్యలను కూడా టిడిపి తప్పు పట్టింది. వైయస్ మంచి, జగన్ దొంగ అంటే ఎలా అని ప్రశ్నించారు. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఢిల్లీ వెళ్లిన తర్వాతే ఆయన ఆస్తుల కేసులో సిబిఐ దర్యాఫ్తులో వేగం తగ్గిందని టిడిపి నేతలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు.
హైకోర్టు జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తునకు ఆదేశించిన తర్వాత కేసు వేగంగా ఉందన్నారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిశారని, తాను కాంగ్రెసుకు మద్దతు పలుకుతానని ప్రధానికి హామీ ఇచ్చారని, అందువల్లే సిబిఐ దర్యాఫ్తులో వేగం తగ్గిందని విమర్శించారు. అయితే ఆ వాదనలు వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలు ఖండించాయి.
అందుకు ధీటుగా వైయస్సార్ కాంగ్రెసు కూడా చంద్రబాబు దొంగచాటుగా హోంమంత్రి చిదంబరాన్ని కలిశారని ఎదురుదాడికి దిగింది. వాటిని టిడిపి ఖండించింది. అయితే తాజాగా శరద్ పవార్, వాయలార్ రవి ఉన్న హోటల్‌కు విజయ సాయి రెడ్డి వెళ్లడంపై తెలుగుదేశం పార్టీ మరోసారి అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more