హన్సిక, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రము దేశముదురులో అల్లు అర్జున్ సరసన కథనాయకిగా చిత్రరంగంలో అడుగుపెట్టింది. ఒక నేర వార్తా కథనాలను సేకరించే విలేఖరి క్రైం రిపోర్టర్ ఒక సన్యాసిని (హన్సిక పాత్ర) తో ప్రేమలో పడటం ఈ చిత్ర ఇతివృత్తం ఈమె హి: ద ఓన్లీ వన్ అనే హిందీ చిత్రంలో తన కుటుంబం తరఫున పగతీర్చుకోవటానికి ప్రతిన బూనిన హంతకురాలి పాత్రను పోషిస్తున్నది. 2008 మేలో జూనియర్ ఎన్.టి.ఆర్ తో కలసి నటించిన కంత్రి చిత్రం విడులైంది. ఇది బాక్సాఫీసు వద్ద ఒక మోస్తరు విజయాన్ని సాధించింది. హన్సిక ఇటీవలి తెలుగులో ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కరము అందుకొన్నది.
ఇటీవల ఓ సందర్భంలో ఈ బబ్లీ బ్యూటీ తన స్కూల్ డేస్‌ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తను పాల్గొన్న డాన్స్, డ్రామాల గురించి చెబుతూ.. ఒక రోజు వేదిక మీద ఎలాంటి తడబాటు లేకుండా నేను యాక్ట్ చేస్తే.. అందరూ ‘పిల్ల భలే ముద్దొచ్చేస్తోంది’ అన్నారు. నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావని కూడా అన్నా. అప్పుడే నాకు యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్ ఏర్పడింది’’ అన్నారు హన్సిక.. ప్రస్తుతం ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారామె.
ఇప్పటివరకు తమిళంలో విజయ్, ‘జయం’ రవి, ప్రస్తుతం శింబుతో ‘వేట్టయ్ మన్నన్’, సూర్య సరసన ‘సింగమ్-2’... ఇలా స్టార్ హీరోల చిత్రాలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హన్సిక... ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ సరసన నటించడం టాపిక్ అయ్యింది. ఉదయనిధికి ఇది తొలి సినిమా కదా? అనే ప్రశ్న హన్సిక ముందుంచితే - ‘‘అయితే ఏంటి? ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియడంలేదు. ఒకప్పుడు నేనూ కొత్తే కదా. అయినా ఇప్పటివరకు నేను యాక్ట్ చేసిన హీరోల అభిమానులందరికీ ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా బాగా తెలుసు. ఒక నిర్మాత హీరో అయితే యాక్ట్ చేయకూడదా? ఈ సినిమా తర్వాత ఉదయనిధి స్టాలిన్‌కి ‘స్టార్ వేల్యూ’ రావడం ఖాయం. ‘ఓకెఓకె’ అంత బాగుంటుంది.
నేనెప్పుడూ స్టార్ హీరో, చిన్న హీరో అని వ్యత్యాసం చూడలేదు. కథ, నా పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తాను’’ అన్నారు. ఎలాంటి పాత్రలు చేయాలంటే ఇష్టం? అని హన్సికను అడినప్పుడు -‘‘నా స్కిన్‌టోన్‌కి పల్లెటూరి పిల్ల పాత్రలు నప్పదు. ‘వేలాయుధం’లో ఈ తరహా పాత్ర చేసినప్పుడు.. హన్సిక నప్పుతుందా? అని చాలామంది సందేహపడ్డారు. కానీ, ఆ చిత్రంలో విలేజ్ గాళ్‌గా ఒదిగిపోవడానికి ఎక్కువ కేర్ తీసుకున్నాను. దాంతో పాస్ అయ్యాను. ఏదేమైనా ఇకనుంచి విలేజ్ గాళ్ కేరక్టర్స్ చేయాడానికి ఇంట్రస్ట్ చూపించకూడదనుకున్నాను’’ అని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more