Young heroes tollywood old songs

young heroes tollywood old songs,Telugu songs, latest free telugu movie songs, devotional songs, hindi songs, pop album, Ramcharan Teja, Pavan Kalyan, Mahesh babu, NTR, Prabhash, Raviteja, Manchu vishnu, Allari naresh,

young heroes tollywood old songs

young.gif

Posted: 04/02/2012 03:57 PM IST
Young heroes tollywood old songs

young heroes tollywood old songs

పాత సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన మంచి పాటను రీమిక్స్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందుకే ఇప్పుడు పాత పాటలకు కొత్త బాణీలు కడుతున్నారు. ఇప్పుడంతా అదే ట్రెండ్ నడుస్తోంది. పాట ఏదైనా... పల్లవించాలి. ఆడియన్స్ చెవిని తాకాలి. ప్రేక్షకులు మెచ్చాలి. అప్పుడే ఆ పాట సూపర్ డూపర్ హిట్. పాటలు సినిమాకి ప్రాణం. అవి ఎంత మధురంగా ఉంటే అంత మంది ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారు. ఆడియన్స్‌ని మెప్పించిన గీతాలను రీమిక్స్ చేసి ప్రేక్షకుల్లోకి వదులుతున్నారు. యువ హీరోలంతా ఇదే ఫాలో అవుతున్నారు.జగపతిబాబు, నాగార్జున, బాలకృష్ణ మొదలుకొని పవన్ కల్యాణ్, మహేశ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్, మంచు విష్ణు, మనోజ్, అల్లరి నరేష్, సుమంత్, వరుణ్ సందేశ్, తనీష్, కృష్ణుడు తదితరులందరూ పాత పాటలకు కొత్త స్టెప్పులు వేస్తున్నారు.

ఈ ట్రెండ్ జగపతిబాబు 'పెళ్ళిపీటలు' చిత్రంతో మొదలైందని చెప్పవచ్చు. ఏఎన్నార్ 'ఆత్మబలం' చిత్రంలోని 'చిటపట చినుకులు పడుతూ ఉంటే' అనే పాటను రీమిక్స్ చేసి జగపతిబాబు, సౌందర్యపై చిత్రీకరించారు. 'మగధీర' చిత్రంలో 'బంగారు కోడిపెట్ట' రీమిక్స్ పాటకు డ్యాన్సు చేసిన రామ్‌చరణ్ తాజాగా 'రచ్చ'లో 'గ్యాంగ్‌లీడర్'లోని 'వానా వానా వెల్లువాయో' పాటలో అభిమానులను అలరించడానికి రెడీ అయ్యాడు. నటుడు సుబ్బరాజు ప్రధాన పాత్ర పోషిస్తున్న 'జయహే' చిత్రంలో 'ఆకలిరాజ్యం' చిత్రంలోని 'సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్' అనే పాటను రీమిక్స్‌చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. గత ఏడాది విడుదలైన అల్లరి నరేష్ 'అహ నా పెళ్ళంట' చిత్రంలో 'నాలుగు స్తంభాలాట' చిత్రంలోని 'చినుకులా రాలి' అనే పాట రీమిక్స్‌ను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు.

అంతకు ముందు కూడా అల్లరి నరేష్ 'సీమశాస్త్రి'లో 'మంచం వేసి దుప్పటేసి' అనే రీమిక్స్ పాటకు చేసిన డ్యాన్స్‌కు, 'సీమటపాకాయ్'లో 'ఆకాశంలో ఒక తారా' అనే రీమిక్స్ పాటకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. రవితేజ 'వీరా'లో 'డ్రైవర్‌రాముడు'లోని 'మామిళ్ళతోటకాడ నీవొస్తే' అంటూ కాజల్‌తో సరదాగా ఆడిపాడాడు. ఎన్టీఆర్ ఆ మధ్య 'అల్లరి రాముడు' చిత్రంలో 'రెండువేలా రెండు వరకు' అంటూ తన తాత నటించిన 'వేటగాడు'లో పాటను, 'యమదొంగ'లో 'ఓలమ్మి తిక్కరేగిందా' అంటూ 'యమగోల'లోని మరో పాటను రీమిక్స్ చేశాడు. ప్రభాస్ 'అడవిరాముడు'లోనూ ఆనాటి 'అడవిరాముడు' చిత్రంలోని 'ఆరేసుకోవోయి పారేసుకుందాము హరీ' అంటూ ఆర్తితో స్టెప్పులేశాడు. మహేశ్ 'పోకిరి'లో తన తండ్రి కృష్ణ నటించిన 'గౌరి' చిత్రంలోని పాటతో 'గల గల పారుతున్న గోదారిలా' అంటూ సముద్రం ఒడ్డున ఇలియానాతో డ్యూయెట్ పాడుకున్నాడు. వైవీఎస్ చౌదరి 'దేవాదాసు' చిత్రంలో 'అమ్మమాట' చిత్రంలోని 'మాయదారి చిన్నోడు' అనే పాటకు కొత్త బాణీలు కట్టించి ఇలియానాతో కుర్రకారును వెర్రెత్తించాడు.

young heroes tollywood old songs

యువ హీరోలే కాదు... సీనియర్ హీరోలు కూడా పాత పాటలను రీమిక్స్ చేసి తమ అభిమానులతో జేజేలు పలికించుకుంటున్నారు. బాలకృష్ణ 'అల్లరి పిడుగు'లో తన తండ్రి నటించిన 'భలేతమ్ముడు' చిత్రంలోని 'నేడే ఈనాడే' అనేపాట, 'ఒక్కమగాడు' చిత్రంలో 'ఛాలెంజ్ రాముడు' చిత్రంలోని 'పట్టుకో పట్టుకో పట్టు చీర' అనేపాటతో అభిమానులను హుషారెత్తించాడు. నాగార్జున 'నేనున్నాను' చిత్రంలో 'దసరాబుల్లోడు'లోని 'ఎట్టాగో ఉన్నాది ఓలమ్మి' పాటను, 'కేడీ'లో 'ప్రేమ్‌నగర్' చిత్రంలోని 'ము ముద్దంటే చేదా' అనే పాటను రీమిక్స్ చేసి అలరించాడు. మంచు విష్ణు తొలిచిత్రం 'విష్ణు'లో 'మిస్సమ్మ'లోని 'రావోయి చందమామ' అనేపాటను రీమిక్స్ చేసి పాత పాటలపై తనకున్న ఇష్టాన్ని వెలిబుచ్చాడు. 'కృష్ణార్జునులు' చిత్రంలో తన తండ్రి మోహన్‌బాబు 'రౌడీ గారి పెళ్ళాం'లోని 'యమ రంజు మీద ఉంది పుంజు' అనే పాటతో మరోసారి వెండితెరపై రీమిక్స్ పాటలో కనిపించాడు. నేనేం తక్కువ కాదు అన్నట్లు గోపీచంద్ కూడా 'లక్ష్యం'లో 'ఇల్లరికం'లోని 'నిలువవే వాలు కనులదానా' అంటూ హీరోయిన్‌ని ఆట పట్టించాడు.

young heroes tollywood old songs

'కోతిమూక' చిత్రంలో 'బందిపోటు'లోని 'ఊహలు గుసగుసలాడే' అంటూ చిలిపి చేష్టలతో కృష్ణుడు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. యువ హీరో తనీష్ 'రైడ్'లో బాలకృష్ణ 'మంగమ్మగారి మనవడు'లోని 'దంచవే మేనత్త కూతురా' పాటతో హీరోయిన్‌ని తెగ అల్లరి పెట్టాడు. పవన్‌కల్యాణ్ 'ఖుషి'లో 'మిస్సమ్మ'లోని 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' అనే పాటను, 'జానీ'లో 'ఈ రేయి తీయనిది' అంటూ ఎన్టీఆర్ 'చిట్టిచెల్లెలు' సినిమాలోని పాటను రీమిక్స్ చేశాడు. సుమంత్ 'రాజ్' చిత్రంలో 'భీమవరం బుల్లోడ' అనే పాటను, మంచు మనోజ్ 'నేను మీకు తెలుసా?'లో 'వయసు పిలిచింది'లోని'మబ్బే మసకేసిందిలే' అనే పాటను కొత్త బాణీలతో ప్రేక్షకుల్లోకి తీసుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ee rojullo movie success meet
April fools day  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more