April fools day

April Fool's Day,April Fools Day Pictures, Images, Pics, Comments, Sayings, Graphics, Wishes,

April Fool's Day

April0102.gif

Posted: 04/02/2012 03:28 PM IST
April fools day

APRIL_FOOLS_DAY

ఏప్రిల్‌ ఒకటిన ఒకరిని ఫూల్‌ చేసి ఎవరెస్టు ఎక్కినంతగా సంతోషిస్తుంటాం. మనకంటే పెద్దవాళ్లను ఫూల్‌ చేయడానికి పేటెంట్‌ ఉన్న రోజు. అందరినీ ఆటపట్టించడం, సరదాగా అబద్ధాలు చెప్పి ఏడిపించడం, వేళాకోళం చేయడం... నిజమని నమ్మేస్తే ఫూల్‌ అంటూ గేలిచేయడం ఏప్రిల్‌ ఫస్ట్‌ ప్రత్యేకత. ఆల్‌ ఫూల్స్‌ డే పేరుతో దీన్ని ప్రపంచ మంతటా అనేక దేశాల్లో సరదాగా జరుపుకొంటున్నారు. అసలు ఆల్‌ ఫూల్స్‌ డే ఎలా పుట్టింది... దానికి సంబంధించిన కారణాలేంటి అనే విషయం పై ఈ ‘ఆల్‌ ఫూల్స్‌ డే’ రోజు తెలుసుకుందాం..

గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్స వాలు చేస్తూ ఉంటాము. సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూవుంటాం. సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము. ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడు తుంది. పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు, ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. ఈ కోవలో... మనం ఈసారి ఏప్రిల్‌ ఫస్ట్‌ రోజున జరుపుకుంటున్న ‘ఆల్‌ ఫూల్స్‌ డే’ గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.

april fool Pictures

ఇదీ చరిత్ర...
ఏప్రిల్‌ ఫూల్‌ అనేది తొలుత యూరోప్‌లో ప్రారంభమైంది. 1582వ సంవత్సరానికి ముందు యూరోప్‌లో 25 మార్చి నెల నుంచి ఏప్రిల్‌ మొదటి తేదీవరకు నూత న సంవత్సరం వేడుకలు ఘనంగా జురుతుండేవి. 13వ పోప్‌ గ్రేగరీ ఈ సంవత్సరంలోనే ఓ కొత్త క్యాలెండరును విడుదల చేసి జనవరి 1వ తేదీ నుంచి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాని చాలా దేశాలు దీనిని నిరోధించాయి. అప్పటివరకు యూరప్‌ లో ఏప్రిల్‌ ఫస్ట్‌ రోజున కొత్త సంవత్సర వేడు కలు జరుపుకునేవారు. నూతన సంవత్సరం ఉత్సవాలు, వసంత కాలపు సంబరాలు పది రోజుల పాటు ప్రజలు ఆనందంగా నిర్వహిం చుకునేవారు.

ఉత్సవాల ముగింపు సందర్భం గా ఒకరికి మరోకరు బహుమతులు ఇచ్చే ఆచారాన్ని పాటించేవారు. అయితే ఫ్రాన్స్‌ దేశాన్ని తొమ్మిదవ ఛార్లెస్‌ రాజు పరిపాలిస్తున్న కాలంలో... అనగా... 1582లో చార్లెస్‌-9 కేలెండెర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. అయితే సమా చర వ్యవస్థ అంతగా వృద్ధి చెం దని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరిం ది. ఈలోగా మళ్ళీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజాజ్ఞ తెలిసిన కొందరు జనవరి ఫస్ట్‌ రోజున కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కొందరు మాత్రం మొదటినుంచీ వస్తున్న ఆచారాన్ని మార్చడానికి ఇష్టపడక జరుపుకోలేదు.

Happy_April_Fools_Day_2012

వాళ్ళు మాత్రం యథావిధిగా ఏప్రిల్‌ 1 వరకు ఆగి ఆ రోజు మాత్రమే కొత్త సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. జనవరి ఫస్ట్‌ రోజున జరుపుకున్న వారు ఇది చూసి, ఏప్రిల్‌ ఫస్ట్‌ రోజున జరుపుకున్న వారిని ఫూల్స్‌ అని పేర్కొంటూ గేలి చేసేవారు. వాళ్ళకి తెలీకుండా పేపర్‌ చేపల్ని వాళ్ళ వెనక భాగాన కట్టి ఆటపట్టించేవారు. అంతేకాకుండా వాళ్ళని గేలానికి చాలా తేలిగ్గా తెలివితక్కువతనంతో దొరికిపోయే చేపల క్రింద జమకట్టి, వాళ్ళని ఏప్రిల్‌ ఫిష్‌ అంటూ అల్లరి పెట్టేవారు.

అలా అలా ప్రపంచమంతా...

april fool days

ఈ ఆటపట్టించే విధానం ఏప్రిల్‌ ఫూల్స్‌ డేగా మరో రెండు వందల ఏళ్ళకల్లా అమెరికా, బ్రిటన్‌, స్కాట్లండ్‌ తదితర దేశాలకు తెలిసిపోయింది. అలా ప్రపంచమంతా పాకిపోయింది. ఒకరిపై మరొకరు ఎన్నో రకాల జోక్స్‌ వేసుకోవడం ఆనవాయితీ అయ్యింది. అది రానురాను ప్రాక్టికల్‌ జోక్స్‌ చేసుకునే స్థాయికివెళ్ళింది. ఈ పాక్టికల్‌ జోక్స్‌ మొదట్లో సున్నితంగా ఉన్నా, అప్పుడప్పుడు కాస్త శ్రుతిమించడం జరుగుతూ ఉంది. ఏదే మైనా సరదాగా, సంతోషంగా జరుపుకునే ఈ వేడుక మన దేశంలోనూ మారుమూల గ్రా మాల్లోనూ జరుపుకుంటుండడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young heroes tollywood old songs
Telugu desam party leaders to join hands with ys jagan mohan reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more