దమ్ము ఆడియో ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ ..దమ్ము సినిమా యూనిట్ టీమ్ కు పేరు పేరున కృతజ్ఞతలు చెప్పటం .. అందరికి ఆశ్చర్యం కలిగించింది. మమూలుగా అయితే సినిమా యూనిట్ సభ్యుల అందరికి ఒక సారి మా కృతజ్ఞతలు అని చెబుతారు. కానీ ఎన్టీఆర్ తనదైన స్టైల్ దమ్ము ఆడియో వేదిక మీద చూపించారు. ఆయన చెప్పిన తీరు బట్టి.. ఎన్టీఆర్ లో విధేయతను గుర్తు చేస్తుంది. ఆయన విధేయతను బట్టి ప్రముఖుల మనస్సులను ఎన్టీఆర్ దోసుకున్నాడని వేదిక మీద ప్రముఖులు అంటున్నారు.
ఎన్టీఆర్ యూనిట్ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పాటంతో... సినిమా యూనిట్ సభ్యులు ఆనందానికి హద్దేలేకుండా పోయింది. ఒక ప్రముఖ స్టార్ తమ పేర్లను ఇలా గుర్తుపెట్టుకొని.. వేదిక మీద ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు చెప్పటం జీవితంలో మర్చిపోలేని తిపీ గుర్తుగా మిలిగిపోతుందని వారు అంటున్నారు.
కె.ఎస్.రామారావుగారు పదేళ్ళుగా నాతో సినిమా చేయాలని తిరుగుతున్నారు. ఎనిమిదేళ్ళుగా బోయపాటి పేరే చెబుతున్నారు. అంతలో 'సింహా' చూసి అచ్చబాబోయ్ అనుకున్నాను. కానీ ఆ సక్సెస్ కోసం మాత్రమే ఆయనకు నేను సినిమా ఇవ్వలేదు. 'సింహా' తర్వాత నాకు 9 కథలు చెప్పాడు. నచ్చలేదు. మరొకడైతే మన కాంపౌండ్‌లోనే కనిపించడు. కానీ శీనయ్య పదో కథగా 'దమ్ము' చెప్పాడు. ఇలాంటి దమ్ముతోనే మనం అభిమానుల్ని మెప్పించగలమని కౌగలించుకున్నాను. ఈ సినిమాలో చేయడం నా అదృష్టం. నాకు కీరవాణిగారంటే ప్రాణం. 'రాలిపోయే పూవా' పాటను వినకపోతే నేను నిద్రపోను. ఇప్పుడు అది నా భార్యకు కూడా అలవాటైపోయింది. దమ్ము కోసం శీనయ్య ఎంతో కృషి చేశాడు. మీరందరూ ఎదురు చూసేంత గొప్ప సినిమా అవుతుంది'' అని అన్నారు.
రాజమౌళి చెబుతూ "ఎన్టీఆర్‌తో నేనేం సినిమా చేసినా హిట్ గురించి ఆలోచించను. అది అతని కెరీర్‌కు ఎలా ఉపయోగపడుతుందనే ఆలోచిస్తాను. త్వరలో అలాంటి సినిమా చేయాలన్న ఆలోచన ఉంది. బోయపాటి శీను మంచి మాస్ సినిమాలు తీస్తున్నాడు. ఈ సినిమా పాటలు చాలా బాగున్నాయి. త్వరలో సినిమా చూసేయాలన్న ఆతృత నాలో ఉంది'' అని తెలిపారు. శ్రీనువైట్ల చెబుతూ "దమ్ము పెద్ద హిట్ కావాలి. నా 'బాద్‌షా' రికార్డులు 'దమ్ము' రికార్డుల్ని బ్రేక్ చేయాలి. అదే నా ఆకాంక్ష'' అని అన్నారు. తొలిసారి ఎన్టీఆర్‌తో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని త్రిష చెప్పారు. "మా అమ్మ హీరోయిన్‌గా నటించిన బ్యానర్‌లో నేను నటించడం ఆనందంగా ఉంది. హీరోయిన్‌ని ఎలా చూపించాలో బోయపాటికి బాగా తెలుసు. త్రిష నాకు బెస్ట్ కో ఆర్టిస్ట్'' అని కార్తీక అన్నారు.
అభిమానులకు ఆర్ధిక సాయం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరి అభిమానుల కుటుంబాలకు చెరో రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సాయాన్ని ఇదే వేదికపై ఎన్టీఆర్ అందచేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, రాఘవేంద్రరావు, చంద్రబోస్, వల్లి, గణేష్ బండ్ల, రత్నం, రామ్‌లక్ష్మణ్, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, అలీ, అభినయ, ఆర్థర్ విల్సన్, ఆనంద్ సాయి, కొడాలి నాని తదితరులు పాల్గొన్నారు. వేల్ రికార్ట్స్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more