Cag report exposes major land scam in andhra pradesh during

CAG Report Exposes Major Land Scam in Andhra Pradesh During,ysr allotted land to reddy brothers for airdrome, former andhra pradesh chief minister ys rajasekhara reddy, former karnataka bjp minister and mining tycoon gali janardhan reddy

CAG Report Exposes Major Land Scam in Andhra Pradesh During

Jagan.gif

Posted: 03/30/2012 01:30 PM IST
Cag report exposes major land scam in andhra pradesh during

CAG Report Exposes Major Land Scam in Andhra Pradesh During

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత కడప ఎంపి జగన్‌కు కాగ్‌ నివేదిక పెద్ద గుదిబండగా మారబోతున్నది. ఆయన ఇమేజ్‌కి కాగ్‌ రిపోర్టు డ్యామేజ్‌గా పరిణమించింది. చేస్తోంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా భూకేటా యింపులు చేయటంపై ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన కాగ్‌ నివేదిక జగన్‌ అస్తులు ఆయన సంస్థల్లో పెట్టుబడులను ప్రరోక్షంగా ప్రస్తావన చేసేవిధంగానే ఉందని రాజకీవర్గాలు భావిస్తున్నాయి. సెజ్‌లకు దివంగత వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాంలో పెద్ద ఎత్తున భూముల కేటాయింపులు జరిగాయి. సెజ్‌ల ఏర్పాటు ద్వార లక్షలాది ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. అయితే ప్రభుత్వం చెప్పినట్టు జరక్కపోగా సెజ్‌ల లక్ష్యాలు పక్కదారి పట్టాయి. 

సెజ్‌లలో పరిశ్రమలకు బదులు కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ప్రారంభించారు. రాష్ట్రమంతటా కలిపినా సెజ్‌లద్వారా 40 వేలకు మించి ఉద్యోగాలు కల్పించలేకపోయారు. కాగా ప్రభుత్వం నుంచి భూములు పొందిన వారిలో అత్యధికలు జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారన్న అభియోగాలు ఉన్నాయి. ఇటీవల సీబీఐ కూడా జగన్‌ సంస్థల్లో పెట్టబడులపై విచారణలు జరుపుతూ వస్తోంది.

తాజాగా కాగ్‌కూడా ప్రభుత్వ భూముల కేటాయింపులపైనే తప్పుబట్టింది. భారత కంప్ట్రోలర్‌ ఆడిట్‌ జనరల్‌ స్వయం ప్రతిపత్తి గల సంస్థ కావటంతో సహజంగానే కాగ్‌ నివేదికకు ప్రాధాన్యత ఏర్పడిందంటున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా జరిగిన పార్టీ సమావేశంలో జగన్‌ అక్రమ ఆస్తులకు సంబంధించి కాగ్‌ నివేదికను బ్రహ్మాస్త్రంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రమంతటా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్న అభిప్రాయానికొచ్చింది.

కడప జిల్లాలో వాణిజ్య విమానాశ్రయం, ఫ్లయింగ్ అకాడమీలను ఏర్పాటుచేసేందుకు బ్రహ్మణి సంస్థకు 3,115 ఎకరాల భూమిని కేటాయించారని, అయితే కేంద్ర విధానాలను, స్థల అనుకూలత, ప్రాజెక్టు మనుగడను పరిగణనలోకి తీసుకోకుండా విమానాశ్రయానికి భూమిని కేటాయించారని కాగ్ పేర్కొంది. కడప విమానాశ్రయం నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ప్రతిపాదిత విమానాశ్రయం ఉందన్నది కూడా విస్మరించారని కాగ్ ఆక్షేపించింది. అలాగే కడప జిల్లాలోనే గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటుచేసేందుకు బ్రహ్మణి సంస్థకే 10.760 ఎకరాల భూమిని కేటాయించడాన్ని కూడా కాగ్ తప్పు పట్టింది. ఇందులో 674 ఎకరాల జలాశయ భూములు కూడా ఉన్నాయని, పర్యావరణ అనుమతులు లేకుండా ఈ భూమిని కేటాయించడాన్ని కాగ్ తప్పుపట్టింది.

CAG Report Exposes Major Land Scam in Andhra Pradesh During

అలాగే ప్రాజెక్టు రిపోర్టును అధ్యయనం చేయకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా గండికోట రిజర్వాయర్ నుంచి బ్రహ్మణికి రెండు టిఎంసిల నీటిని కేటాయించడాన్ని కూడా ఆక్షేపించింది.అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ సంస్థకు 8844 ఎకరాల భూమిని కేటాయించడం, అక్కడ ఎటువంటి పరిశ్రమ స్థాపించకుండానే ఎకంగా ఆ సంస్థ 4397 ఎకరాల భూమిని బాంకులో తాకట్టు పెట్టి 790 కోట్లు రుణాన్ని తీసుకోవడాన్ని కూడా కాగ్ తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న ఓబుళాపురం మైనింగ్ సంస్థ 413 ఎకరాల భూమి కోసం దరఖాస్తు చేసుకోగా, 2008లో కలెక్టర్ దీనిని నిరాకరించారు. అయితే ఒక నెల కాలంలోనే ఎపిఐఐసి విజ్ఞప్తి మేరకు 304 ఎకరాల భూమిని ఓఎంసికి అప్పగించాలని కలెక్టర్ నిర్ణయం తీసుకోవడాన్ని కూడా కాగ్ తప్పుపట్టింది. రంగారెడ్డి జిల్లాలోని ఐదొందల ఎకరాల భూమిని అతి తక్కువ ధరకే టెక్‌జోన్, బ్రహ్మణి ఇన్‌ఫ్రాటెక్‌లకు కేటాయించడంపై విమర్శలు చేసింది. వాన్‌పిక్‌కు కేటాయించిన భూముల్లో పారదర్శకత లోపించిందని, ఇందులో ఒప్పందాలు వాన్‌పిక్‌కే అనుకూలంగా ఉండడం చూస్తే ప్రభుత్వానికి న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తున్నట్లు కాగ్ పేర్కొంది. ఇక రహేజా ఐటి సంస్థకు ఇచ్చిన భూమిలో 110 ఎకరాల భూమిని అమ్ముకునేందుకు, తనఖా పెట్టుకునేందుకు ఆస్కారం కల్పించేలా ఒప్పందం ఉండడం కూడా ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు కల్పించేదేనని కాగ్ పేర్కొంది.

అంతర్జాతీయ కనెవన్షన్ సెంటర్, స్టార్ హోటల్, గోల్ఫ్ కోర్సు, ఇతర టౌన్‌షిప్‌లతో ఒక విస్తృత ప్రాజెక్టును ఏర్పాటుచేసేందుకు ఎమ్మార్ సంస్థకు 535 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని, అయితే ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసే హక్కులను సహ సంస్థలకు ధారాదత్తం చేయడం వల్ల ఆ భూములపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోవాల్సి వచ్చిందని కాగ్ ఆరోపించింది. ఇక అనంతపురం జిల్లాలో 20 ఎకరాల భూమిని ఆక్రమించుకున్న బళ్లారి ఐరన్ ఓర్ సంస్థపై అక్కడి కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, మరో 5069 ఎకరాలను ఆ సంస్థకు కేటాయించారని కాగ్ ధ్వజమెత్తింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamannas special love for mega family
Motilal nehru institute of technology student big achievment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more