సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం, సీబీఐ డెరైక్టర్ ఎ.పి.సింగ్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ముఖ్యమైన కేసుల దర్యాప్తు పురోగతి, కేసులతో ముడిపడిన పలు అంశాలపై ఆయన వారితో చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ వచ్చిన లక్ష్మీనారాయణ తొలుత సీబీఐ కేంద్ర కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఆయన సీబీఐ డెరైక్టర్‌తో విడిగా సమావేశమై ముఖ్యమైన కేసులపై చర్చలు జరిపారని తెలిసింది. అనంతరం జేడీ చిదంబరాన్ని కలిశారు.
జగన్ అక్రమ ఆస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ.. సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో పలు చర్చలు మొదలయ్యాయి. అక్రమ ఆస్తుల కేసులో మొదటి నిందితుడు జగన్‌మోహనరెడ్డి అరెస్టు కానున్నారా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు అరదండాలు పడనున్నాయా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఏప్రిల్ రెండో తేదీ లోగా ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉన్నందున జగన్ అరెస్టు తప్పదనే భావిస్తున్నాయి.
జగన్‌ను అరెస్టు చేసేందుకు సీబీఐకి లభించిన బలమైన సాక్ష్యాధారాలపైనే వారు దృష్టి పెట్టారు. జగన్ తప్పించుకోవడానికి వీలు లేని అంశాలను చార్జిషీటులో పేర్కొనాలని చిదంబరం సూచించినట్లు తెలుస్తోంది. కేవలం చార్జిషీటు కోసమే జగన్‌ను అరెస్టు చేసి, ఆ తర్వాత బలమైన సాక్ష్యాధారాలను చూపించకపోతే కోర్టు ఈ కేసునే కొట్టేసే అవకాశాలున్నాయని, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందని చిదంబరం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందువల్ల అనుబంధ చార్జిషీటు తర్వాత దాఖలు చేస్తామని కోర్టుకు చెప్పే విషయంపై కూడా లక్ష్మీనారాయణ ఢిల్లీ పెద్దలతో చర్చించినట్లు తెలిసింది.
పైపెచ్చు.. ఏప్రిల్ ఒకటో తేదీ ఆదివారం అయ్యింది కాబట్టి, ఈ నెలాఖరులోపే జగన్ జైలుపాలు కావచ్చన్న ఊహాగానాలు దేశ రాజధానిలో ఊపందుకున్నాయి. ఒకవేళ జగన్‌ను అరెస్టు చేయాల్సి వస్తే.. అందుకు తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలు, దానివల్ల తలెత్తే రాజకీయ పర్యవసానాలపై కేంద్ర హోం మంత్రి చిదంబరంతోను, సీబీఐ డైరెక్టర్ ఏపీసింగ్‌తోను సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ చర్చలు సాగించినట్లు తెలుస్తోంది. సాధారణంగా కేంద్ర హోం మంత్రి వద్దకు నేరుగా సీబీఐ డైరెక్టరే వెళ్తారు. కానీ, ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి చిదంబరాన్ని కలిసి చర్చించడం అసాధారణ పరిణామమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో చార్జిషీటులోని అంశాలపైనే లక్ష్మీనారాయణ చిదంబరం, ఆర్పీ సింగ్‌లతో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే జగన్ అరెస్టులో ఇప్పటికే చాలా జాప్యం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని, మరింత ఆలస్యం చేస్తున్నకొద్దీ దర్యాప్తు సంస్థలపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని చిదంబరం భావిస్తున్నట్లు తెలిసింది. జగన్‌ను అరెస్టు చేయకపోతే, తొలి నిందితుడిని (ఏ-1) అరెస్టు చేయకుండా చార్జిషీటు దాఖలుచేసిన చెడ్డపేరు సీబీఐకి మిగిలిపోతుంది. ఓఎంసీ అక్రమ తవ్వకాల కేసులో చార్జిషీటు దాఖలుచేయడానికి చాలా ముందుగానే ఏ-1 అయిన గాలి జనార్దనరెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మార్ కేసులో ఏ-1 అయిన ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యను కూడా అలాగే అరెస్టు చేశారు. అలాంటప్పుడు జగన్ పట్ల ఎందుకు సానుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అపప్రథ సీబీఐకి చుట్టుకోకూడద నే విషయంపైనే ఢిల్లీలో చర్చలు కేంద్రీకృతమయ్యాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులకు సంబంధించిన కేసులో ఏప్రిల్ 2లోగా సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉన్న తరుణంలో లక్ష్మీనారాయణ.. చిదంబరాన్ని కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎమ్మార్, జగన్ ఆస్తుల కేసుల పురోగతిపై ఆయన కేంద్ర హోంమంత్రికి నివేదించారని తెలిసింది. ముఖ్యమైన కేసుల దర్యాప్తు కీలక దశలో ఉండగా లక్ష్మీనారాయణ స్వయంగా వెళ్లి చిదంబరాన్ని కలవటం చూస్తే కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో సీబీఐ పనిచేస్తోందన్న వాదనలకు బలం చేకూరుతోందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. జగన్ ఆస్తుల కేసు నిందితుల్లో ఒకరైన విజయసాయిరెడ్డిని ఈ ఏడాది జనవరి 2న సీబీఐ అరెస్టు చేసింది. అరెస్టు జరిగినప్పటి నుంచి 90 రోజుల వ్యవధిలో అంటే ఏప్రిల్ 2 లోపు చార్జిషీటును దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలోనే ఈ మంతనాలు చర్చనీయంగా మారాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more