Naidus choices for rs sparks rebellion

Naidus choices for RS sparks rebellion,rajya Sabha nominees, K.E. Krishnamurthy,replacing at least one candidate, Ramesh devendra goud, 2014 TDP, senior leader Talasani Srinivash yadav, nama Nageshra rao,

Naidus choices for RS sparks rebellion

babu.gif

Posted: 03/19/2012 04:46 PM IST
Naidus choices for rs sparks rebellion

Naidu's choices for RS sparks rebellion

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు రాజ్యసభ స్థానాల విషయం పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. సీనయర్ నాయకులు అంత ఒక్కసారిగా బాబు పై దాడికి దిగినట్లు తెలుస్తుంది. బాబు కేటాయించిన పేర్లపై సీనియర్ నేతలు మండిపడుతున్నారు.
రాజ్యసభ స్థానాలకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లపై తెలుగుదేశం పార్టీలో చిచ్చు రగిలింది. టీడీపీకి ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు.. చంద్రబాబు తన సన్నిహితుడైన సి.ఎం.రమేశ్, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడి, ఎన్నికల తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చిన దేవేందర్‌గౌడ్ పేర్లను ఎంపిక చేయటం ద్వారా.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. బాబు తన కోటరీలోని వ్యక్తులకే ప్రాధాన్యతనిస్తూ పదవులు కట్టబెడుతున్నారని సీనియర్ నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాగైతే 2014 వరకు కూడా పార్టీ మనుగడ కష్టమేనని నేతలు బహిరంగంగానే హెచ్చరించారు. రమేశ్, దేవేందర్‌గౌడ్‌ల ఎంపికపై పార్టీ సీనియర్లు కె.ఇ.కృష్ణమూర్తి, తలసాని శ్రీనివాసయాదవ్, అరవింద్‌కుమార్‌గౌడ్ తదితర నేతలు బాహాటంగానే మండిపడ్డారు.
టీడీపీ తరఫున రాజ్యసభకు రెండు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండగా.. వాటికి రమేష్, దేవేందర్‌గౌడ్‌ల పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. దీనిపై పార్టీ నేతలంతా మూకుమ్మడిగా అభ్యంతరం వ్యక్తంచేశారు. . నేతలందరూ వ్యతిరేకించటంతో ఒక దశలో చంద్రబాబు సైతం ఇలా అవుతోందేమిటన్న ఆందోళనలో పడిపోయారు. . రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ టీడీపీలో ప్రతిసారీ నామినేషన్లు వేయటానికి చివరి రోజు ముందు అర్ధరాత్రి వరకు చర్చల పేరుతో సాగదీయటం.. చివరికి తనకు అనుకూలమైన వ్యక్తులకు పదవులు కట్టబెట్టటం బాబుకు మామూలేనని తెలంగాణకు చెందిన మరో నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్యసభ అభ్యర్థుల పేర్లను తాను ప్రతిపాదిస్తూ నేతల అభిప్రాయాలు చెప్పాలని చంద్రబాబు అడగటంతో.. ఆయా నేతల నుంచి గట్టి సమాధానాలే వచ్చాయి. గతంలో ఎప్పుడూ ఎదురు కాని రీతిలో నేతల నుంచి అభిప్రాయాలు వ్యక్తమైనట్లు టీడీపీ వర్గాలు చెప్పాయి. బాబు ఇలాగే వ్యవహరిస్తే 2014 వరకు పార్టీ ఉంటుందో ఊడుతుందో తెలియదని పార్టీ సీనియర్ నేత కె.ఇ.కృష్ణమూర్తి కుండబద్దలు కొట్టారు. ‘‘పార్టీని వీడిన వారికి, ఆయనను (బాబును) తిట్టిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

డబ్బులిచ్చిన వారికి అవకాశం ఇవ్వటమంటే ఈ రకంగా కాదు. కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా పార్టీ నిర్ణయాలు ఉండాలి. ఇలాగే వెళితే 2014 వరకు పార్టీ ఉంటుందో లేదో తెలియని పరిస్థితన్నారు. మరో సీనియర్ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్ కూడా తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత తీవ్ర అసంతృప్తితో బయటకొచ్చిన తలసాని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాబుతో భేటీ అయి బయటకు వచ్చి తలసానిని సముదాయించేందుకు.. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు మీడియా సమక్షంలోనే ప్రయత్నం చేశారు. కొందరు నేతలైతే వీరినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తే టీడీపీ కాంట్రాక్టర్ల పార్టీ అని వస్తున్న విమర్శలు నిజమేనని అందరూ నమ్మే పరిస్థితి ఉంటుందని అధినేత వద్ద కుండబద్దలు కొట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hansika brand ambassador for old age home
Kk shock palvai rajyashaba set  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more