ఉప ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో నేతల మధ్య మాటల వేడి తీవ్రతరమవుతున్నది. ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో మాటల యుద్ధం రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. ప్రధానంగా ఆరు స్థానాలలో తమదే విజయమంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ టార్గెట్‌గా టీడీఎల్పీ ఉప నాయ కుడు మోత్కుపల్లి నర్సింలు గత కొంతకాలం నుంచి నిర్వి రామంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్‌ను విమర్శించటానికి తెలుగు భాష, ప్రత్యేకించి తెలంగాణ భా షలో ఎన్ని విశేషణాలు ఉన్నాయో అన్నిటినీ మోత్కుపల్లి యథేచ్ఛగా ఉపయోగించు కుంటున్నారు.
కొద్ది రోజుల క్రితం కేసీఆర్‌పై విరుచుకుపడుతూ మోత్కుపల్లి ఆయనను తాగుబోతు, తిరుగుబోతు అని అభివర్ణించారు. అమాయకులైన తెలంగాణ బడుగు, బలహీన వర్గాల యువకులు, విద్యార్థులను బలిగొన్న నరరూప రాక్షసుడు అని విరుచుకుపడ్డారు. కేసీఆర్ వైఖరి వల్లనే ప్రొఫెసర్ జయశంకర్ దిగులుతో మరణించారన్నారు. కేసీఆర్ వైఖరిని ఎండగడుతూ పాదయాత్ర ప్రారంభించిన మోత్కుపల్లి, శుక్రవారం మరో సంచలనాత్మకమైన బాంబు పేల్చారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, అప్పుడు తెలంగాణ భవన్‌ను స్వాధీనం చేసుకొని అమ్మివేసి అమరవీరుల కుటుంబాలకు పంచిపెడతామని ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ భవన్‌లో చానల్‌ను నిర్వహిస్తున్నందున ప్రభుత్వం ఇప్పుడే దాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విచిత్రం ఏమిటంటే మోత్కుపల్లి మొదటి నుంచీ కేసీఆర్‌నే టార్గెట్‌గా చేసుకొని విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్‌పై విమర్శలకు అంతంతవరకే పరిమితమయ్యారు.
అటు మోత్కుపల్లి రోజు రోజుకూ మాటల తీవ్రతను పెంచుతుంటే టీఆర్‌ఎస్ వైపు నుంచి వస్తున్న స్పందన అంతంతమాత్రంగానే ఉంటూ వస్తున్నది. ఛోటా మోటా నేతలు అప్పుడప్పుడూ మీడియా సమావేశాలు నిర్వహించి విమర్శించటం మినహా ఆయన చేసిన ఆరోపణలకు టీఆర్‌ఎస్ జవాబు చెప్పలేకపోతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ నేతలంతా ప్రచార బాధ్యతల్లో బిజీగా ఉండటంతో మోత్కుపల్లి దూకుడుకు అడ్డుకట్ట వేసే నేతలే ఉండటం లేదు. అయితే మిగతా రాజకీయ పార్టీల నాయకులు మాత్రం మోత్కుపల్లి కేసీఆర్ మూలుగ తీస్తున్నారని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more