ఆంద్ర రాష్ట్రంలో.. ధీరుడు.. మగధీరుడు... క్రికెట్ ఆటగాడు అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రత్యర్థి పార్టీలపై .. చెలరేగిపోతాడు అనుకుంటే.. సైలెంట్ గా సైడు అవుతున్నాడని ఢిల్లీ నాయకులు అంటున్నారు. రాష్ట్రంలో జరుతున్న ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి .. వింత ప్రకటన చేయటంతో.. అధిష్టానాని షాక్ తగిలినటైంది. అసలు యూపీ ఎన్నికల ఫలితాలతో ఖంగుతిన్న అధిష్టానం సీఎం ప్రకటన.. ( ములిగే నక్క మీద తాటికాయ పట్టినట్లు ) గా ఉందని ఢిల్లీ నాయకులు అంటున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్రమైన ప్రకటన చేశారు.తాము అనుకున్నంతమాత్రాన కాంగ్రెస్ గెలవదని, ప్రజలు కూడా అనుకోవాలని ఆయన అన్నారు. గెలుపు ఓటములకు ప్రజలు బాద్యులని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఉప ఎన్నికలను ఇప్పటికే రిఫరెండమ్ కాదని ఆయన ప్రకటించగా, పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ ఉప ఎన్నికలకు బాద్యులం తాను,సి.ఎమ్. అని వ్యాఖ్యానించారు.
దీంతో ముఖ్యమంత్రి జాగ్రత్తపడి ఈ వ్యాఖ్య చేసినట్లుంది. కాగా వై.ఎస్.జగన్ కు అంత సీన్ లేదని , టిడిపి సైకిల్ కి తుప్పు పట్టిందని ఆయన అన్నారు.అభివృద్ది ఒక్కటే ఓటుకు ప్రాతిపదిక కాదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి విజయావకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. జగన్ కు అంత సీన్ లేదని వ్యాఖ్యానించడం, టిడిపి సైకిల్ తుప్పుపట్టిపోయిందని చెప్పడం వరకు బాగానే తాము కచ్చితంగా ఉప ఎన్నికలలో గెలుస్తామని కిరణ్ చెప్పలేకపోవడం కాంగ్రెస్ బలహీనతగా గుర్తించకతప్పదు. అంతేకాక గెలుపు ఓటములకు తాను బాధ్యత వహిస్తానని అనకపోవడానికి కూడా కిరణ్ ఇష్టపడడం లేదని అర్దం చేసుకోవచ్చు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి చూస్తుంటే.. భారతంలో.. పాండవులు ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం విరాట్ రాజుగారి దగ్గర చేస్తారు. అప్పుడు కౌరవులు .. పాండువులను ఎలగైన పట్టుకోవాలనే ఉద్దేశంతో.. విరాట్ రాజు పై యుద్దం ప్రకటిస్తారు? అంటే విరాట్ రాజు దగ్గర పాండువులు ఉన్నారని వార్తను తెలుసుకుని .. యుద్దం ప్రకటిస్తారు? విరాట్ రాజు ముసలివాడు కావటంతో.. తన కుమారుడైన .. ఉత్తరా కుమారా రాజు.. యుద్దం చేయవలసిందిగా.. విరాట్ రాజు కోరుతాడు . తండ్రి కోరిక మేరకు .. విరాట్ యుద్దం చేయటానికి ..యుద్ద భూమికి వెళ్లినప్పుడు .. అక్కడ ఉన్న కౌరవ సైన్యాన్ని చూసి.. యుద్దం చేయకుండానే.. వెనుతిరిగిపారిపోతాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి పరిస్థితి కూడా అలాగే ఉందని ... ఢిలీ నాయకులు కథలు చెప్పుకొని .. నవ్వుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికలకే ఇలా భయపడితే.. ఇక 2014 ఎన్నికలలను ఎలా ఎదుర్కొంటాడు అని .. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more