ఇప్పుడు అందరి కళ్లు .. ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేస్ యాదవ్ పై నిలిచాయి. ముఖ్యంగా అయితే ఏపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అఖిలేష్ లో .. లోకేష్ ను చూసుకుంటున్నాడని పార్టీ వర్గాలు అంటున్నాయి. బాబు ముందు .. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత .. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అఖిలేష్ గా వర్ణించుకుంటే.. ఆ పార్టీ సంబరాలు చేసుకుంటుందని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. జగన్ కూడా మంచి జోష్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. ములాయం సింగ్ పార్టీ జగన్ సహాయటంతో.. ఆ పార్టీ గెలిచిందని జగన్ అనుకుంటున్నాడట. అంతేకాకుండా.. ఈ ఇద్దరు అభినందనలు కూడా చెప్పుకున్నారని మీడియా ద్వారా తెలిసింది. అవన్నీ జగన్ మనస్సు లో పెట్టుకొని .. రాబోయే ఎన్నికలలో .. ఆంధ్ర అఖలేష్ నేనే అని .. పార్టీ కార్యకర్తలతో జగన్ అంటున్నాడని చెబుతున్నారు.
వైఎస్ జగన్ కథ అలా ఉంటే.. నారా వారి కథ వేరే విధంగా ఉంది. ములాయం సింగ్ యాదవ్ పార్టీ గుర్తు .. తెలుగు దేశం పార్టీ గుర్తు ఒక్కటే కావటంతో.. బాబు ఆనందంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే .. అక్కడ సైకిల్ గెలిచింది కాబట్టి .. రాబోయే ఎన్నికలలో కూడా .. ఏపీలో సైకిల్ గెలుస్తుందని బాబు అంటున్నాడని .. పార్టీ నాయకులు అంటున్నారు. అసలు బాబు మనస్సులో.. తన కుమారుడు అయిన లోకేష్ బాబు కూడా ఆంధ్ర అఖిలేష్ గా ఊహించుకుంటు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు బాబు.
ఇప్పుడు ఏపీలో రాబోయే ఎన్నికలలో ఆంధ్ర అఖిలేష్ ఎవరు ? అనేది పెద్ద చర్చగా మారింది. ఆంధ్ర అఖిలేష్ .. జగనా? లేక లోకేష్ బాబా? అనే దాని పై ఇరుపార్టీల వారు.. సందిగ్థంలో పడ్డారు. కొంత మంది ఆంధ్ర అఖిలేష్ .. జగనే అని అంటున్నారు. ఎందుకంటే.. జగన్ కు.. రెడ్డి వర్గం వారు, ఎస్సీలు, ఇంక తదితరులు ..అండగా ఉండారని .. వారు ఓటు బ్యాంకు మొత్తం జగన్ కే వస్తాయని కాబట్టి .. ఆంధ్ర అఖిలేష్ జగనే అని .. వైఎస్ జగన్ అభిమానులు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.
తన కుమారుడు నారా లోకేష్ రాజకీయ ఎంట్రీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ లాగా రాష్ట్రంలో లోకేష్ వస్తారా అని మీడియా ప్రతినిధులు అడితే బాబు వస్తాడని గట్టిగా చెబుతున్నాడు . లోకేష్ రాజకీయ ఎంట్రీపై లోతుగా విశ్లేషణ జరగాల్సి ఉందని ఆయన అన్నారు. దీన్ని బట్టి నారా లోకేష్‌ను రాజకీయ ఆరంగేట్రం చేయించే విషయంపై చంద్రబాబు తీవ్రంగానే ఆలోచిస్తున్నారని అంటున్నారు. అందులోను బాబు భజన చేసే నాయకులు కూడా .. మన లోకేష్ బాబు ను రాజకీయాల్లోకి తీసుకురాండి అని చెప్పాడంతో.. బాబు గాలి ఊదిన బెలున్ లా ఉబ్బిపోయాడని .. పార్టీ వర్గాలు అంటున్నాయి.
నిజానికి, ఇది వరకే నారా లోకేష్‌కు రాజకీయ ప్రవేశానికి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌ను అడ్డుపెట్టి తన బావమరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అసంతృప్తి బావుటా ఎగురేయడంతో ఆయన వెనక్కి తగ్గారు. నారా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశానికి నందమూరి కుటుంబ సభ్యుల నుంచి ఏ విధమైన వ్యతిరేకత రాకుండా చూసుకోవాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. తనకు వియ్యంకుడైన బాలకృష్ణను హరికృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్‌కు అడ్డం పెట్టి నారా లోకేష్‌కు లైన్ క్లియర్ చేయాలనేది చంద్రబాబు యోచనగా చెబుతున్నారు. బాలకృష్ణ పిల్లనిచ్చిన మామ కావడంతో లోకేష్ ఎంట్రీకి ఆటంకం కలిగించరని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, నారా లోకేష్ రాజకీయ ప్రవేశంపై మాత్రం పార్టీలో కూడా తీవ్రంగానే ఆలోచన సాగుతూనే ఉన్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more