రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిరంజీవి ఒక అద్దంలా కనిపిస్తున్నాడు. ఇప్పుడు అందరి చూపు చిరంజీవి పైనే ఉన్నాయని తెలుస్తుంది. చిరంజీవిని త్వరలో రాజ్యసభకు పంపడం ఖాయమని తెలియటంతో.. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు చిరు పైనే మనస్సు పెట్టారు. ఎప్పుడు లేనిది కొత్తగా వీరు ఇలా చేయటంతో.. చిరుకు ఆశ్చర్యం కలుగుతుందట. అసలు విషయం ఏమిటి అంటే.. చిరంజీవి రాజ్యసభకు వెళ్లితే.. ఆయన ఎమ్మెల్యే పదవి ఖాళీ అవుతుంది కాబట్టి .. ఆ పదవికి తమ కొడుకులను, అల్లుళ్లను.. భర్తలను .. పదవిని కట్టబెట్టాలన కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని తెలిసింది. అందు కోసం ఎవరికి వారే ముందుగా .. తిరుపతి నుండి .. నా భర్త పోటీ చేస్తాడు? నా కొడుకు పోటీ చేస్తాడు? నా అల్లుడు పోటీ చేస్తాడని .. కాంగ్రెస్ నాయకులు కనిపించిన మీడియా ముందు చెబుతున్నారని తెలిసింది.
అయితే అందరి కంటే ముందుగా చిరు పదవి మంత్రి గల్లా అరుణ కుమారి కన్నేసిందని తెలిసింది. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి.. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కుమారుడు పోటీ చేస్తే తప్పేముందని మంత్రి గల్లా అరుణకుమారి అంటున్నారట. చిరంజీవిని త్వరలో రాజ్యసభకు పంపడం ఖాయం కాబట్టి తద్వారా ఖాళీ అయ్యే తిరుపతి నియోజకవర్గంలో గల్లా అరుణ కుమారుడు పోటీ చేస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అందుకోసం తిరుపతిలో మా అబ్బాయి పోటీ చేయకూడదా? చేస్తే తప్పేముంది? ఒక్క ఇంట్లో ముగ్గురు, నలుగురు పోటీ చేసిన సందర్భాలున్నాయి కదా! అట్లాగే మా తండ్రి టైంలో నేను పోటీ చేయలేదా? అంటూ మీడియాను గల్లా ప్రశ్నించారట.
అంతేకాకుండా డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్, సినిమా యాక్టర్‌ల కొడుకులను అవే వృత్తుల్లో కొనసాగించాలని అనుకుంటున్నప్పుడు రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి రాకూడదా.. వాళ్లకంటే రాజకీయ నాయకులే కిందిస్థాయిలో ఎక్కువ అనుభవం గడిస్తారు కదా అంటున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. గల్లా ముందుగానే ఇలా మీడియా ప్రచారం చేయటంతో.. మిగత కాంగ్రెస్ నాయకులు ఆమె మండిపడుతున్నారని తెలిసింది. అంటే వారు కూడా మనస్సు లో మాటలు బయటికి చెప్పకుండా .. ముఖ్యమైన నేతలతో మంతనాలు జరుపుతున్నారని తెలిసింది. అందులో భాగంగా తమ కోపాన్ని గల్లా పై చూపించారని మీడియా వారు అంటున్నారు.
అసలు కొసమెరుపు : ఇప్పటి వరకు గల్లా అరుణ తన కొడుకును పోటీ చేస్తావా అని అడగలేదట. ఆమె తన కొడుకు నిర్ణయం తీసుకోకుండానే.. మీడియా ముందు తిరుపతి నుండి నా కుమారుడు పోటీ చేస్తాడని చెప్పటం కాంగ్రెస్ నాయకులను ఆశ్చర్యానికి గురిచేసిందని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more