మాజీ పీసీసీ ఛీఫ్ డి. శ్రీనివాస్ కి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి మధ్య విభేదాలు ఉండేవా ? సీఎం గా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి డి. శ్రీనివాస్ ని ఇబ్బందుల పాటు చేశాడా ? అంటే అవును అంటున్నారు శ్రీనివాస్. రెండు సార్లు పీసీసీ పదవిని అధిష్టించి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మంచి లీడర్ గా పేరు సంపాదించిన డి. శ్రీనివాస్ ని దివంగత ముఖ్యమంత్రి వేధించేవాడని ఆ సంఘటనలను తాను జీవితంలో ఎన్నడూ మరచిపోలేనని ఆయనే స్వయంగా అన్నారు.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన వ్యక్తులు గా పేరొందిన డి.శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డిల మధ్య అంతగా చెప్పలేనంత సంఘటనలు ఏం జరిగాయి. అంటే... శ్రీనివాస్ చెప్పిన దానికి బట్టి చూస్తేంటే రాజశేఖర్ రెడ్డి పదవిలో ఉన్నప్పుడు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని డి. శ్రీనివాస్ ని ఎదగకుండా చేశాడని, తనను పై స్థానాలకు ఎదగకుండా చేశాడని ఆయన మాట్లల్లోని అంతరార్థం అని అంటున్నారు.
తాను ఎప్పుడు పదవులు కోసం పనిచేయలేదని, పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి పార్టీ శ్రేయస్సుకోసమే పనిచేసినట్లు ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయని, ఫలితాలు ఏకపక్షంగా ఉండవని పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు.
తెలంగాణ తీవ్రత గతంలో పోల్చుకుంటే ఎక్కువగా లేదని, ఉప ఎన్నికల్లో బాన్సువాడ కన్నా మంచి ఫలితాలు కాంగ్రెసుకు వస్తాయని ఆయన అన్నారు.ఇటీవల మేడమ్ సోనియాను కలిసిన సందర్భంలో తాను ఎవరిపై ఫిర్యాదు చేయలేదని, మర్యాద పూర్వకంగానే ఆమెను కలిసినట్లు ఆయన వివరించారు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో తాను మంత్రి పదవి ఆశించడం లేదని, ఎమ్మెల్సీ పదవి మేడమ్ దయవల్లే వచ్చిందని డీఎస్ స్పష్టం చేశారు. ఏది ఏమైనా వైయస్ డీఎస్ మధ్య భాగానే అంతర్యుద్థం జరిగిందని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more