ఇది కాంగ్రెస్ ప్రభుత్వం.. మా వాళ్లకే ఇళ్లు ఇచ్చుకుంటాం. ఏం చేసుకుంటారో చేసుకోండి.. ఏం ఊడ్చుకుంటారో ఊడ్చుకోండి'..(ఏం పీక్కుంటారో.. పీక్కొండి..) ఈ మాటలు అన్నది ఎవరో కాదు. రాష్ట్ర మాథ్యమిక విద్యాశాఖా మంత్రి కె.పార్థసారథి శాసన సభ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు. రాష్ట్ర మంత్రులు పార్థసారథి, ధర్మాన ప్రసాదరావు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ మంత్రులిద్దరిపై విరుచుకుపడ్డారు.
మా వాళ్లు చెప్పిన వారికే ఇళ్లు మంజూరు చేస్తాం. ఏం చేస్తారో చేసుకోండి' అంటూ మాధ్యమిక విద్యా శాఖ మంత్రి కె పార్థసారథి అసెంబ్లీలో రెచ్చి పోగా, మంత్రి బరితెగించారని, ఇలాగే ఇష్టమొచ్చి నట్లు అధికారాన్ని, నిధులను దర్వినియోగం చేస్తే చంచల్ గూడ జైలుకు పోతారని ప్రతిపక్ష నేత చంద్రబాబు హెచ్చరించారు. రచ్చబండలో ఇందిరమ్మ గృహాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారాన్ని కాంగ్రెస్ నేతలకు అప్పగిస్తూ మంత్రి పార్థ సారథి జారీ చేసిన ఆదేశాలపై అసెంబ్లీలో దుమారం రేగింది. వాడిగా వేడిగా చర్చ జరిగింది. టిడిపి ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపికను కాంగ్రెస్ నేతలకు అప్పగించడం ఏంటని ప్రశ్నించారు. ఇది అధికార దుర్వినియోగం కాదా? కాంగ్రెస్ కార్యకర్తలకు దోచిపెట్టడం కాదా? అని ప్రశ్నించారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు విషయంలో పార్టీ నేతలు ప్రతిపాదించిన పేర్లనే ఆమోదించాలని కృష్ణా జిల్లా మంత్రి సంబంధిత అధికారులకు ఈ-మెయిల్ పంపించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు శాసనసభలో ఆరోపించారు. 'నేను ఈ-మెయిల్ పంపించ లేదు. నేను పంపినట్లు నిరూపిస్తే వారు చెప్పిన దేనికైనా సిద్ధమే. ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం చాలా తప్పు. మేం రచ్చ బండలో ఇచ్చిన ఇళ్లు వారి నియోజకవర్గంలోనే ఇస్తున్నాం. అక్కడ ప్రజాప్రతినిధులు చెప్పిన వారికే ఇస్తున్నాం. వాళ్ల పార్టీ వాళ్లు చెప్పిన వారికే వారు ఇళ్లు ఇచ్చుకుంటున్నారు. మాది కాంగ్రెస్ ప్రభుత్వం.. మా పార్టీ వాళ్లు చెప్పిన వాళ్లకే ఇళ్లు ఇచ్చుకుంటాం. మా పాలసీ ప్రకారం.. ఆన్‌లైన్‌లో పేరుంటేనే ఇళ్లు ఇస్తాం. మేం ఆన్‌లైన్‌లో లేని వాళ్లకు ఇచ్చినట్లు చెబితే వారి పేర్లు రద్దు చేస్తాం.
బాబు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పినట్లు చేయలేదా. చంద్రబాబు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు'.. అని పార్థసారథి తీవ్రంగా స్పందించారు. మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్పందిస్తూ.. ఈ-మెయిల్‌లో ఉన్న పేర్లను చదివి వినిపించారు. మంత్రులు వారి పేర్ల మీద ఈ-మెయిల్స్ పంపరని అన్నారు. అధికారులతో చెప్పి చేయిస్తారని, ఆ తర్వాత అధికారులు జైలుకు వెళతారన్నారు. దీంతో మంత్రికి, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మా నేతలు ప్రతిపాదించిన వాళ్లకే ఇళ్లు కేటాయిస్తాం. నేను ఎవరికీ 'ఈ-మెయిల్' పంపలేదు. నేను తప్పుకోకుండా.. వారు ఎవరి పేర్లయితే చదివారో ఆ పేర్లను నేనే రిక్వెస్ట్ చేశా.. నేను రికమండ్ చేస్తా. అని మంత్రి ఆవేశంతో ఊగిపోతూ అన్నారు. మంత్రి మాటలను బాబు తప్పుబట్టారు. ప్రభుత్వం మంత్రి జాగీరు కాదని మండిపడ్డారు.
నా వ్యక్తిగత మెయిల్ నుంచి పంపినట్లు లేదా నా ఫోన్ నెంబర్ నుంచి పంపినట్లు ఉంటే ఆధారాలు చూపించండి. రచ్చబండ కార్యక్షికమంలో దరఖాస్తు చేసుకున్న వారికి, ఆన్‌లైన్‌లో చేసుకున్న వారికి మాత్రమే కేటాయిస్తున్నాం. అలా కాదని నిరూపించగలిగితే దేనికైనా సిద్ధమే. చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు. ఒక్కో నియోజకవర్గానికి రెండు వేల ఇళ్లు ఇస్తున్నాం. అర్హులైన వారికే ఇస్తున్నాం. మీరు చెప్పిన వాళ్లకు ఇమ్మంటే ఎలా కుదురుతుంది? (మళ్లీ కొద్దిసేపు టీడీపీ సభ్యుల నిరసనల తర్వాత స్పీకర్ ఎమ్మెల్యే కేశవ్‌కు అవకాశం ఇచ్చారు)
(మంత్రి పార్థసారథి ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్న లేఖను సభలో చదివి వినిపించారు) అవనిగడ్డకు మండలి బుద్ధవూపసాద్, కైకలూరుకు కే రాజాబాబు, మాజీ జెడ్పీటీసీ అంకప్ప తదితరుల పేర్లు, ఫోన్ నెంబర్లు ఇచ్చారు. అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేని కాదని కాంగ్రెస్ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగిస్తారా? మంత్రి తనకేం తెలియదంటూ నా సంతకం ఉందా? అని అడుగుతున్నారు. జీవోల్లో మంత్రుల సంతకాలు ఉంటాయా? ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్యదర్శులు నడుచుకుంటారు. మీరు అలా చేయలేదంటే, ఇలా ఆదేశాలు జారీ చేసిన కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయండి.
నేను ఈ మెయిల్ ఇవ్వలేదు. రచ్చబండలో, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వాళ్లకే ఇళ్లు ఇస్తున్నాం. మా పార్టీ నాయకులు చెప్పిన వాళ్లకు ఇమ్మని చెప్పాను. (కాస్త ఆవేశంగా) ఎస్.. నేను రికమండ్ చేశాను. చేస్తాను. కృష్ణా జిల్లా మంత్రిగా మా వాళ్లకు నేను చేస్తాను. నేను చెప్పిన వాళ్లకే ఇమ్మని చెప్పాను. అందులో తప్పేముంది? మీరు చేయలేదా? ఏయ్! మూసుకోవోయ్.. మూసుకో. (స్పీకర్లు పని చేయలేదు. ఎమ్మెల్యే కేశవ్ రెట్టించడంతో మంత్రి స్పందిస్తూ ‘రా దమ్ముంటే రా’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు)
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more