మహేంద్ర సింగ్ ధోని, కెప్టెన్‌గా, ఆటగాడిగా ఈ జార్ఖండ్ డైనమైట్, చెనై్ కింగ్ టాలెంట్ ఏంటో తెలుసు. భారత్‌ను అటు టీ20, ఇటు వన్డే ఛాంపియన్‌గా నిలిపిన వన్ అంట్ ఓన్లీ కెప్టెన్. అంతేకాదు టెస్టుల్లో నెంబర్‌గా కూడా నిలిపాడు. గత కొంత కాలంగా కెప్టెన్‌గా ఒత్తిడిని ఎదుర్కొంటున్నా.. మ్యాచ్‌లను ముగించడం లో తనదైన శైలిని ప్రదర్శిస్తున్నాడు. కెరీర్ మొదట్లో ధోని బ్యాటింగ్‌కు దిగుతున్నాడంటే.. సిక్స్‌తో ముగిస్తాడా లేక ఫోరా.. ఇలా అభిమానుల మధ్య బెట్టింగ్‌లు కూడా సాగేవి. అతడు కొట్టే వింత వింత షాట్లు చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ప్రత్యర్థులకు కూడా ధోని ఆట అర్థమయ్యేది కాదు. బలంగా బంతిని బాదితే అది ల్యాండ్ అయ్యేలోపు అక్కడ ఫీల్డర్లు కాదు ప్రేక్షకులుండేవారు.
అంటే అతడి బ్యాట్‌నుంచి వెలువడే పవర్ అలా ఉండేది. కొత్తగా క్రికెట్ ప్రపంచానికి హెలీకాప్టర్ షాట్ అనే ఒక వింతైన షాట్‌ను పరిచయం చేశాడు. బ్యాట్‌ను గుండ్రంగా తిప్పుతూ బాదాడంటే బౌండరీ అవతల ప్రేక్షకులు బాల్ పట్టుకోడానికి రెడీగా ఉంటారు.
ఇదంతా ఓ పక్కకి నెట్టితే ధోనిలోని స్పెషల్ క్వాలిటీ ఏంటంటే మ్యాచ్‌లను అద్భుతంగా ముగించడం. ఒకప్పుడు భారత్ వరుసగా 16 మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేసిందంటే దానికి ఒకే ఒక కారణం మహేంద్ర సింగ్ ధోని. మ్యాచ్ ఏదశలో ఉన్నా తన పవర్ ప్యాక్‌డ్ బ్యాటింగ్‌తో భారత్‌ను విజయ తీరాలకు చేర్చేవాడు.
అప్పుడే కాదు కెరీర్ స్టార్టింగ్ నుంచి మొన్న జరిగిన అడిలైడ్ మ్యాచ్‌వరకు ధోని మ్యాచ్‌లకు తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అతడు ఛేజింగ్‌లో 49సార్లు నాటౌట్‌గా నిలిస్తే భారత్ 30సార్లు మ్యాచ్ నెగ్గిందంటే అతడి శైలిని మనం అర్ధంచేసుకోవచ్చు. ఆ మ్యాచ్‌ల్లో బ్యాట్‌తోనే కాకుండా కీపర్‌గా 189క్యాచ్‌లు, 63స్టంపింగ్‌లు లెక్కలేని రనౌట్లు ఉన్నాయి. అంతకు తోడు కెప్టెన్సీ కూడా తోడుంది. తన అద్భుతమైన ఫినిషింగ్స్ తో ధోని భారత అభిమానుల గుండెలనే కాదు, అటు ప్రత్యర్థులను కూడా తన వశపర్చుకున్నాడు.
శ్రీలంక కెప్టెన్ మహేళ జయవర్థనే కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. ధోని లాంటి వ్యక్తికి ఇంచ్ గ్యాప్ కూడా ఇవ్వకూడదని.. ఇస్తే మ్యాచ్‌లను ఎత్తుకుపోతాడని అన్నాడు. అతడు ఓ గ్రేట్ ఫినిషరని మహేళ అన్నాడు. చాలా కూల్‌గా తనపని తాను చేసుకుపోవడమే అతని బలమైన వ్యక్తిత్వానికి నిదర్శనమనన్నాడు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more