అది శాసన సభ, అక్కడ ఎమ్మెల్యేలు. మంత్రులు అంత హడవిడిగా వెళ్లుతున్నారు. అక్కడ ఏంజరుగుతుందో తెలియదు. కానీ శాసన సభ్యులు మొత్తం ఆనం ప్రకటించే రాష్ట్ర బడ్జెట్ పై పలు పలు విధాలుగా ఆలోచనలు చేస్తూ .. అసెంబ్లీలో తిరుగుతున్నారు. ప్రతిపక్షలు, మిత్రపక్షలు .. మాత్రం చెవిలో పువ్వులు కోసం పబ్లిక్ గార్డెన్ మొత్తం కలియతిరుగుతున్నారు. ఇంతలో అసెంబ్లీలో ఎవరు ఊహించని ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి జరిగిందని చెబుతున్నారు. అసలు అసెంబ్లీలో ఏం జరిగింది?
అక్కడ ఏం జరిగిదంటే.. తిరుపతి ఎమ్మెల్యే మెగాస్టార్ చిరంజీవి అసెంబ్లీలోకి అడుగు పెట్టాగానే.. అక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రుల చూపు ఒక్కసారిగా చిరు పై పడింది. చిరంజీవిని చూసిన వారు మనస్సులో చిరు ఈ వయస్సులో ఇంత స్లిమ్ గా ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? చిరుకు ఇంత గ్లామర్ ఎలా వచ్చింది? అనే ప్రశ్నలు వారి మనస్సుల్లో తిరుగుతున్న సందర్భంలో , కొంత మంది తన ఆలోచనలను ఆపుకోలేక బయటపడుతుంటారు? అలాంటి వారిలో ప్రతిపక్షన ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఇలా చిరు పై వెల్లబుచ్చాడు.
ఏమండి మెగాస్టార్ చిరంజీవి గారు.. బాగా సన్నబడ్డారు.. గ్లామర్ మాత్రం తగ్గలేదు అని అనటంతో.. మోత్కుపల్లి మనస్సులో ఉన్నభారం దిగిపోయి హ్యాపిగా ఉన్నాడని అక్కడున్న వారు అంటున్నారు.. అదే సందర్బాంలో అప్పుడే సికింద్రాబాద్ ఎమ్మెల్యే నటి జయ సుధ అటుగా వస్తూ, మోత్కుపల్లి అన్న మాటలు విని జయ ‘చిరు’ నవ్వుతో.. ఆ చిరు వైపు చూసిందట. అయితే జయ సుధ రాకను గమనించిన చిరంజీవి. జయ .. ఈయన నన్ను స్లిమ్ అయ్యావ్.. గ్లామర్ తగ్గలేదంటున్నాడు అంటూ జయతో చిరు మాటలు కలిపాడు. అంతే జయ .. చిరు నటించి సినిమాలోని పాటల దగ్గరకు ఆమె మనస్సు వెళ్లిందని అంటున్నారు.
చిరు మాటలు జయ సుధకు గతం ఒక్కసారిగా గుర్తుకు వచ్చి నవ్వుతూ.. ఆనందంతో మన ఇద్దరం ఇక్కడే ఉంటే .. ఏదో డ్యూయెట్లు పాటుకుంటున్నారు అని .. మోత్కుపల్లి మ్యూజిక్ చేస్తాడేమోనని జయ సుధ నవ్వుతూ చిరుతో వెళ్లిపోయారని అక్కడున్న శాసన సభ్యులు అంటున్నారు. ఎంతైన ఒకప్పటి నటి నటులు కాబట్టి ఆ మాత్రం సనువు ఉంటుందని మీడియా ప్రతినిధులు గుసగుసలాడుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more