తెలుగు చలన చిత్ర దర్శకుడుగా సంచలనం సృష్టించటంలో మగధీరుడు, తెలుగు సినీ కథారచయిత విజయేంద్ర ప్రసాద్ కుమారుడు, అగ్ర దర్శక రాఘవేంద్ర రావు శిష్యుడుగా పేరు తెచ్చుకున్న ఎస్. ఎస్ రాజమౌళి. స్టూడెంట్ నెం. 1 చిత్రతం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి.. వెండి తెరపై మగదీరుడుగా ముద్ర వేయించుకున్నాడు. ఇప్పటి వరకు రాజమౌళి ఒక పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యకత అని చెప్పావచ్చు. రాజమౌళి సినిమా రంగానికి రాక ముందు .. టీవీ ధారవాహికలకు పని చేశాడు. అతను తీసిన తక్కువ సినిమాలు అయిన .. అవి తెలుగు ప్రజలకు ఎంతో వినోధాన్ని, సందేశాన్ని కల్గించాయి. అయితే రాజమౌళి ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు.
ఆయన కొత్త అవతారం ఎత్తింది రాజమౌళి కోసం కాదట. ఆయన హోంగార్డుల కోసం రాజమౌళి కొత్త అవతారం ఎత్తాడని సినీ ప్రజలు అంటున్నారు. అసలు రాజమౌళి ప్రభుత్వ హోంగార్డులకు ఉన్న సంబందం ఏమిటి? వారి కోసం రాజమౌళి తన పద్దతి ఎందుకు మార్చుకున్నాడు? వారిపై ఏదైన సినీమా తీస్తున్నాడా? అనే అనుమాలు ఫిలింనగర్లో తిరుగుతున్నాయి. అందుకు రాజమౌళి హోంగార్డులకు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలిసినట్లు తెలుస్తుంది.
అసలు ఏం జరిగిందంటే.. సినీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సచివాలయానికి వెళ్లి , ముఖ్మమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులందరికీ ప్రమాద బీమ సౌకర్యం కల్పించాలని కోరారని తెలుస్తుంది. రాజమౌళి హోంగార్డుల సమస్యలపై ఎందుకు స్పందించారో ఎవరి అర్థం కాలేదని రాజకీయ నాయకులు అనుకుంటున్నారు.
రాజమౌళి డిసెంబరు 31న ‘వాదా’ అనే స్వచ్ఛంద సంస్థ తరపున హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ విధులను చేపట్టారు. రాజమౌళి చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హోంగార్డులకు ప్రమాద భీమా సౌకర్యం లేదని తెలుసుకున్నారు. హోంగార్డులకు ప్రమాద భీమా లేకపోవటం ఆయన చాలా బాధ పడ్డాడని అభిమానులు అంటున్నారు. ఎందుకంటే.. సీనిమా షూటింగ్ సమయాలలో భారీ షెటింగ్ ను వేసినప్పడు, సినీమా వాళ్ళకు రక్షణగా ఎక్కువ భాగం హొంగార్డులే ఉంటారని రాజమౌళికి తెలుసు. అలాంటి సమయంలో ఎలాంటి ప్రమాదం జరిగిన ముందుగా బాధ్యులైది .. హొంగార్డులేనని రాజమౌళి అంటున్నాడు.
అందు నిమిత్తమం వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని రాజమౌళి సీఎంను కోరారట. అందులో భాగం వాదా సంస్థ రాజధానిలోని 1700 మంది హొంగార్డులకు ప్రమాద భీమా చేయించిందని చెబుతున్నారు. ఈ బీ మా పత్రాలను పంపిణీ చేసేందుకు రావాలంటూ వాదా తరపున సీఎంను ఆహ్వానించేందుకు రాజమౌళి సచివాలయానికి వెళ్లారని తెలుస్తుంది. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హొంగార్డులకు ప్రభుత్వమే భీమా సౌకర్యం కల్పించాలని రాజమౌళి వినతి పత్రం సమర్పించారని తెలుస్తుంది.
రాజమౌళి చేపట్టిన హొంగార్డుల ప్రమాద భీమా సౌకర్యం కూడా విజయం అయితే .. అపజయమేలేని మగధీరుడిగా చరిత్రలో నిలిపోతాడని హొంగార్డులు అంటున్నారు. అటు సినిమా రంగంలోనే కాకుండా ..ఇటు స్వచ్ఛంద సంస్థ తరపున రాజమౌళి చేస్తున్న పనులు చూసి చాలా మంది రాజమౌళిని మెచ్చుకుంటున్నారని ప్రజలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more