మన రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతుందన్నది నిజం. మరి మద్యాన్ని నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మంత్రే నిబంధనలకు నీళ్ళొదిలి మధ్యం వ్యాపారుల అడుగులకు మడుగులొత్తి ఏకంగా తనే 10 లక్షల వరకు ముడుపులు తీసుకున్నట్లు ఏసీబీ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. అయితే ఈ ఆరోపణ పై స్పందించిన ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంటకటరమణ తీవ్రంగా ఖండించారు. తాను ఏ తప్పు చేయలేదని, ఇందుకు సంబంధించిన ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని, ఏసీబీ తమ వివరణ తీసుకోకుండా తన పేరును రిమాండ్ రికార్డుల్లో చేర్చడాన్ని మోపిదేవి తప్పుపట్టారు. అసలు రమణ ఎవరో తనకు తెలియదని, ఓ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తి అని, అతను గంజాయి స్మగ్లర్ అని, అతని పై చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయని, అతనిని నేను ఎప్పుడు కలవలేదని అతడు చెప్పిన వాంగ్మూలాన్ని తీసుకుని ఏసీబీ తమ పేరును చేర్చడం సరికాదని ఆయన అన్నారు. ఇదే విషయమే ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కలుసుకుని వివరణ ఇస్తూ, తమపై విచారణకు కోరినట్లు ఆయన తెలిపారు.
గతకొంతకాలంగా ఎక్సైజ్‌శాఖకు సంబంధించి స్వంత్రంగా శాఖ లేదని, తనకు ఆ భాద్యతను ఇచ్చినప్పుటి నుంచి దీనిపై పరిశీలన జరిపిన తర్వాత ఎక్సైజ్ శాఖ గాడి తప్పిందని చెప్పానని ఆయన అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎమ్మార్పీ ధరలకే మధ్యం విక్రయించేలా అనేక చర్చలు తీసుకున్నానని, అయినా ఎమ్మార్పీ ధరలకు మద్యం విక్రయించని వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించినట్లు మోపిదేవి పేర్కొన్నారు . బినామీ పేర్లతో అనేక వైన్ షాపులు నడిపిస్తున్న రమణ తనపై ఆరోపణ చేయడం క్షమించరానిదని ఆయన మండిపడ్డారు.
సిండికేట్ వ్యాపారులకు తాను కంట్లో నలుసుగా తయారైనందు వల్లే దురుద్ధేశ్యంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని మోపిదేవి విమర్శించారు. తమపై వచ్చిన ఆరోపణలపై స్పష్టమైన విచారణ జరపాలని, ఆరోపణలు నిజమైతే రాజీనామా చేయడానికి సిద్ధమని మోపిదేవి పేర్కొన్నారు. అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని అన్నారు.
విచారణ అనంతరం నా ప్రతిష్టకు భంగం కలిగించిన అందరిపై చర్యలు తీసుకుంటానని మోపిదేవి అన్నారు. తాను గౌరవ ప్రదమైన కుటుంబంలో పుట్టానని, తన తల్లిదండ్రుల క్రమశిక్షణలో నైతిక విలువలతో పెరిగానని, రూపాయికి ప్రాధాన్యత ఇచ్చే వాడిని కానని, నైతికతకు ప్రాధాన్యత ఇస్తానని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు. తమపై ఆరోపణలు చేసిన వ్యక్తి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిని, అలాంటి వ్యక్తి ఆరోపణలు చేస్తే తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. ముడుపుల విషయం విచారణ జరిపితే కొద్ది రోజుల్లో అన్నీ బయటకు వస్తాయన్నారు. తనకు ఎవరితోనైతే డబ్బులు పంపానని రమణ చెప్పారో, ఆ వ్యక్తి మంగళవారం రాత్రే దానిని ఖండించారని మోపిదేవి అన్నారు.
మరి మోపిదేవి ఇంత మొత్తుకున్నా ఈయన గండం నుండి బయటపడతారో లేదో చూడాలి. ఒక వేళ అధికారం అడ్డం పెట్టుకొని ఈయన ఈ కేసు నుండి బయట పడినా ప్రజలు మాత్రం ఈయన్ని విశ్వసించరని రాజకీయ నాయకులు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more