తెలుగు వెండి తెరకు హాస్య నటుడిగా పరిచయం అయిన సునీల్ .. తన టాలెంట్ తో .. హీరో రేంజ్ కు ఎదిగిన మాట వాస్తవం. అయితే సునీల్ హీరోగా రావటానికి కారణం టాలీవుడ్ లో కోంత మంది ఉన్నారని .. సునీల్ చెబుతున్నాడు. సునీల్ కు హీరో మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టమాట. అయితే సునీల్ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడని చెబుతుంటారు. అసలు సునీల్ వినయ విధేయతలే సునీల్ ను హీరోగా చేశాయని ఫిలింనగర్ లో ఆయన మిత్రులు అంటున్నారు.
సినిమా ఇండస్ట్రీలో .. హాస్య నటులు చాలా మంది హీరోలుగా చేసి.. చివరకు హస్యనటులుగానే మిలిగిపోయారు. సునీల్ మాత్రం తన కేరియర్ ను జాగ్రత్త ముందుకు తీసుకుపోతున్నాడట. అతనిలో హీరో అనే ఫిలింగ్ కనిపించకుండా .. అందరి ముందు గత హాస్య నటుడినే చూపిస్తున్నాడు. సునీల్ హీరోగా నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అయితే ఇప్పడు సునీల్ కు కొత్త బిరుదు వచ్చింది.
హాస్య నటుడు నుంచి పూర్తి స్ధాయి హీరోగా మారిన సునీల్ కు ఇప్పుడో కొత్త బిరుదు చేరింది. ఆయన తాజా చిత్రం పూలరంగడులో సూపర్ రాజా సునీల్ అని వేస్తున్నారట. రవితేజకు మాస్ మహారాజా, అల్లరి నరేష్ కు మాస్ రాజా అనే బిరుదులు ఉన్న నేపధ్యంలో సునీల్ కు ఈ బిరుదుని తగిలించి పోస్టర్స్ వేస్తున్నారని ఫిలింనగర్ లో అంటున్నారు. ఈ చిత్రం పిబ్రవరి 18న విడుదల సిద్దంగా ఉంది. అయితే పూర్తి కామిడీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంపై సునీల్ కు చాలా అంచనాలు ఉన్నాయని చెబుతున్నాడు.. వర్మ దర్శకత్వంలో రూపొందిన అప్పలరాజు చిత్రం డిజాస్టర్ కావటంతో ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడని తెలుస్తుంది
అలాగే ఈ చిత్రంలో సునీల్ సిక్స్ ప్యాక్ లో కనిపించి మురిపించటానికి రెడీ అవుతున్నారని తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ లో ఈ సిక్స్ ప్యాక్ ప్రదర్శన ఉంటుందని సమాచారం. అల్లరి నరేష్ తో అహనా పెళ్లంట అనే చిత్రం తీసి హిట్ కొట్టిన వీరభద్ర చౌదరి ఈ చిత్రం డైరక్ట్ చేస్తున్నారట. అలాగే ఈ చిత్రం దిలీప్ ...మళయాళంలో చేసిన పండిపడ చిత్రం ఆధారంగా రూపొందిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. యూనిట్ మొత్తం ఈ చిత్రం విజయంపై కాన్ఫిడెంట్ గా ఎదురుచూస్తున్నారు. బిజినెస్ మ్యాన్ నిర్మించిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సునీల్ కెరీర్ లోనే ఎక్కువ ప్రింట్స్ తో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని ఫిలిం ఛాంబర్ దగ్గర నిర్మాతలు గుసగుసలాడుకుంటున్నారు.
ఏమైన సునీల్ జీవితంలో పూలరంగడు .. మూవీ పూలబాట వేయాలని కోరుకుంద్దాం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more