బాలయ్య విశాఖ టూర్ లో చేసిన విమర్శలు ఇప్పడు బాలయ్యకు తూటలై పేలుతున్నాయి.. బాలయ్య చిరంజీవి పై చేసిన కామెట్లు, కాంగ్రెస్ పై చేసిన విమర్శలు, ఇప్పడు కాంగ్రెస్ బాణాలై బాలయ్య పైకి నాయకుల రూపంలో దూసుకొస్తున్నాయి. విజయవాడ కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ బాలయ్య సవాల్ విసిరారు.
లగడపాటి రాజగోపాల్ రాజకీయ నాయకుడుగా అందరి తెలిసిన వ్యక్తి, అయిన లగడపాటి, కేసిఆర్ కు ఐలవ్ యూ చెప్పిన మాటలు రాష్ట్రమంత వినిపించాయి. అప్పటి నుండి లగడపాటి రాష్ట్రంలో ప్రముఖ వ్యక్తిగా మీడియాలో కనిపిస్తున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసిఆర్ పోరాడుతుంటే .. లగడపాటి మాత్రం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడని వ్యక్తి. ఈ ఇద్దరు కలిసి నిమ్స్ డాక్టర్లకు నిద్రలేకుండా చేశారని అందరి తెలుసు.
బాలయ్య చేసిన కామెట్లకు లగడపాటి సవాల్ విసిరారు. రాజకీయ విమర్శలు , పంచ్ డైలాగులతో చెలరెగిపోతున్న బాలయ్యకు లడగపాటి అడ్డుతగిలారు. బాలయ్యకు సత్త , నా అంత బలం ఉంటే ముందు ఎన్నికల రంగంలోని దిగమని లగడపాటి అంటున్నారు.. అంతేకాకుండా నీకు దమ్ముంటే తిరుపతి నుంచి ఒక సామాన్య కాంగ్రెస్ నాయకుడి పై గెలిచి చూపించు అని లగడపాటి బాలయ్యకు గట్టి సవాల్ విసిరారు.
అంతేకాకుండా డైలాగు చెప్పటం, తొడ కొట్టడం, మీసాలు మెలేయ్యటం రీల్ లైఫ్ లో తప్ప రియల్ లైఫ్ లో తగవని హితువు పలికారు.
బాబు 2009 ఎన్నికలలో మూడు శాతం ఓట్లు కూడా లేని టీఆర్ఎస్ చూట్టూ తిరిగి ప్రాధేయపడి బాబు పొత్తుపెట్టుకున్న టిడిపి కి 24 శాతం ఓట్లే వచ్చాయాని బాలయ్యకు గుర్తు చేశారు. అది ఒకసారి మనస్సులో పెట్టుకొని ఈ సారి తొడ కొట్టు ,మీసాం మెలేయ్య అంటే బాలయ్యను లగడపాటి ఎగతాళి చేశారు. అదే 2009 లో ఎన్నికలలో మెగా స్టార్ చిరంజీవి ఎవ్వరితో ఏ పొత్తు లేకుండా పోటీ చేసి 18 శాతం ఓట్లు సాధించారని బాలయ్యకు గుర్తు చేశారట. చిరంజీవి పై పోటీకి సిద్దమన్న బాలయ్య ప్రకటనల వల్ల అనవసరంగా వారి వారి అభిమానుల మధ్య విభేదాలు పెరుగుతాయని అందువల అలాంటి ప్రకటనలు మానుకోమని బాలయ్య కు సలహా ఇచ్చారట. అసలు బాలయ్యను లగడపాటి తిట్టడం వెనుక పెద్ద రహస్యం దాగిందట.
విజయవాడ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన లగడపాటి రాజగోపాల్. ఆయన కమ్మ వర్గానికి చెందినా, బాలయ్య కమ్మ వర్గానికి చెందినప్పటికి లగడపాటి బాలయ్య పై నిప్పులు కురిపించాడట. అయితే లగడపాటి బాలయ్య పై లడాయికి దిగటం చాలా శోచనీయంగా ఉందని.. లగడపాటి అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఎవ్వరి తెలియని నిజం ఒకటి లగడపాటికి తెలుసాడట. అందుకే గతంలో కూడా ‘‘ప్రత్యేక తెలంగాణ వద్దు .. సమైక్యాంధ్ర ముద్దు ’’ అంటూ కొత్త నినాదం తెచ్చి కేసిఆర్ కు ఐ లవ్ యూ చెప్పాడు లగడపాటి.
విజయవాడ నియోజక వర్గంలో ఎక్కువ శాతం సామాజిక వర్గానికి చెందిన కాపులు ఉన్నారు. కమ్మ శాతం చాలా తక్కువగా ఉన్నారని భావించి లగడపాటి బాలయ్యకు చుక్కులు చూపించాడు. అంటే 2014 ఎన్నికలలో మళ్లీ లగడపాటి ఎంపిగా గెలవాలంటే.. బాలయ్యకు సవాల్ విసిరట మంచిదని లగడపాటి అభిమానులు అంటున్నారు. అయితే ఈ చర్యతో కమ్మ వర్గం వారు బాదపడ్డప్పటికి , కాపు వర్గానికి లగడపాటి దగ్గరవుతారని లగడపాటి సన్నిహితులు అంటున్నారు. అంటే విజయవాడలో ఎక్కువ శాతం కాపులు ఉన్నారు కాబట్టి .. తన ఓటు బలం కోసం లగడపాటి బాలయ్యను పావుగా వాడుకున్నాడని బాలయ్య అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more