సినిమా ప్రపంచంలో తమిళ శంకర్ సుబ్రమణ్యం అంటే సినిమా ప్రేక్షకులకు, ఎవ్వరికి తెలియక పోవచ్చు. కానీ డైరెక్టర్ శంకర్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన దర్శకత్వంలో మొదటిగా 1993లో తమిళ , తెలుగు లో ‘ జెంటిల్ మెన్’. ఈ సినిమా శంకర్ ను డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. అప్పటి నుండి సినిమా ప్రేక్షకులకు, సినిమా ప్రపంచనికి డైరెక్టర్ శంకర్ గా పరిచయం అయ్యాడు. ఆ రోజు నుండి శంకర్ గారు మంచి కథలను రెఢి చేసుకోని, గొప్ప సినిమాలను విడుదల చేయటం మొదలుపెట్టాడు. శంకర్ దర్శకత్వంలో , తెలుగు , తమిళ , హిందీలలో సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. శంకర్ తీసిన సినిమాలు ‘జెంటిల్ మెన్, ప్రేమికుడు, జీన్స్’ తదితర సినిమాలు శంకర్ ఖ్యాతిని పెంచాయి. గత సంవత్సరంలో సూపర్ స్టార్ రజనీకాంత్, మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ లతో చేసిన ‘రోబో’ ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చింది. మళ్లీ శంకర్ మరొ కొత్త ప్రయోగం చేశాడు. కొత్త హీరోలతో తమిళం లో ‘నన్బన్’ ( త్రీ ఇడియట్స్) విడుదలై సంచలనం రేపుతున్నాడు. తమిళ ‘నన్బన్’ సినిమాను తెలుగులో ‘స్నేహితుడు’గా డబ్బింగ్ చేసి రేపు విడుదల చేయబోతున్నాడు శంకర్. (స్నేహితుడు) కూడా తెలుగు లో మంచి విజయం సాధిస్తుందని శంకర్ సన్నిహితులు అంటున్నారు.
అయితే కోలివుడ్ కొత్త హీరోలతో శంకర్ ఇంత పెద్ద విజయం సాధించటం చాలా గ్రేట్ అని అందరు అంటున్నారు. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత స్థానం హీరో విజయ్ దేనని తమిళ సినీ అభిమానలు అంటున్నారు. ఇప్పటి వరకు తెలుగు తెర పై హీరో విజయ్ కనిపించలేదట. తొలి పరిచయంగా శంకర్ దర్శకత్వంలో స్నేహితుడు సినిమా ద్వారా అవుతున్నారట. విజయ్ చాలా ఆనందంగా ఉందట. ఈ సినిమాలో ఇంక ఇద్దరు హీరోలు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు హీరోలు జీవా, శ్రీరామ్. ఈ ఇద్దరు తెలుగు తెరకు పరిచయం అయిన వారే. అయిన హీరో విజయ్ మాత్రం తొలిసారిగా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రావటం కొత్తగా ఉందని తెలుగు సినీ ప్రజలు అంటున్నారు. అంత గొప్ప డైరెక్టర్ కొత్త హీరోలతో ఈ ప్రయోగం ఎందుకు చేశాడు? ‘ స్నేహితుడు’(నన్బన్) సినిమాలో హీరో విజయనే ఎందుకు తీసుకున్నాడు? అనే ప్రశ్నలు కోలివుడ్, టాలీవుడ్ లో షికార్లు చేస్తున్నాయి. ప్రముఖ డైరెక్టర్లు , నిర్మాతలు, హీరోలు కూడా ఇలాగే అనుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసల విషయం ఏమిటి? దీని వెనక పెద్ద కథ ఉందని డైరెక్టర్ శంకర్ సన్నిహితులు అంటున్నారు.
శంకర్ గారు ఇలా చేయ్యట వెనక చాలా గోప్ప రహస్యం ఉందట. అసలు శంకర్ గారిని గ్రేట్ డైరెక్టర్ గా తీర్చిదిద్దింది తమిళ డైరెక్టర్ యస్.ఎ. చంద్రశేఖర్ గారట. ఆయన వద్ద శంకర్ శిష్యారికం చేశారట. ఆ రోజల్లో ఆయన చాలా మంచి డైరెక్టర్, రైటరట. అయితే శంకర్ తీసిన (నన్బన్) ‘స్నేహితుడు’ సినిమాలో హీరో విజయ్ ,డైరెక్టర్ యస్.ఎ. చంద్రశేఖర్ కొడుకేనట. యస్.ఎ. చంద్రశేఖర్ దగ్గర శంకర్ ఓనామలు తిద్దికొని.. మంచి డైరెక్టర్ , రైటర్ గా సినీ ప్రపంచాలోకి అడుగుపెట్టాడట.అయితే డైరెక్టర్ శంకర్ గురువైన యస్.ఎ.చంద్రశేఖర్ గారు ఒక కోరిక తీర్చమని అడిగాడట. అది ఏమిటయ్య అంటే ‘‘ నీవు గోప్ప డైరెక్టర్ అయిన తరువాత నా కొడుకు విజయ్ తో ఒక సినిమా చేయ్యాలని శంకర్ ను అడిగాడట’’. శంకర్ తన గురువుకు ఇచ్చిన మాటను ఈ రోజు ఇలా తీర్చుకున్నాడట.
అయితే తన గురువు అడిగిన కోరికను తీర్చి గురుశిష్యుల బంధం చాలా గొప్పదని రుజువు చేశాడని తమిళ ప్రజలు అంటున్నారు. అయితే హీరో విజయ్ కు కొంత కాలంగా మంచి సినిమాలు లేకపోవటంతో విజయ్ తండ్రీ డైరెక్టర్ శంకర్ ను కలసి అసలు విషయం చెప్పడట. శంకర్ ఎంతో ఆనందంతో గురువు కోరికను (నన్బన్) ‘స్నేహితుడు’ రూపంలో తీర్చుకున్నాడని, కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more