బంధుత్వం కంటే మించింది స్నేహం అంటారు. గొప్ప స్నేహితులు దొరకడం ఒక అద్రుష్టం అనుకుంటే... దానిని జీవితాంతం కొనసాగించడం వరం. మరి అలాంటి స్నేహానికి ప్రతీకగా నిలుస్తారు కొందరు. అలాంటి వారి జాబితాలోకి రజినీ, కమల్ హాసన్ లు కూడా వస్తారు. అయితే వీరు క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న ఫ్లోన్లోనైనా మాట్లాడుకుంటారట. ఒకే స్థాయిలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం కుదరదని చాలామంది అంటుంటారు. తమకు తామే గొప్ప అనే భావన ఉండటంవల్లనే వారు స్నేహం చేయలేరని అందుకు ఓ కారణం కూడా వెతికి చెబుతుంటారు.
ఈ మాటల్లో కొంతవరకు నిజం ఉండొచ్చు గానీ రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి వ్యక్తులకు మాత్రం ఇది వర్తించదు అనాలి. హీరోలుగా కెరీర్ ఆరంభించినప్పుడు ఈ ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే ‘స్టార్’ హోదా వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి నటించడం మానేశారు. దానికి కారణం వారి మధ్య నెలకొన్న పోటీయో, ఇగోనే మాత్రం కాదు. రజనీ, కమల్ స్థాయి స్టార్ హీరోలు కలిసి నటించాలంటే అందుకు తగిన కథ దొరకాలి. అలాంటి దమ్మున్న కథ దొరక్కపోవడంవల్లే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా కుదరలేదు. కలిసి వారు సినిమా చేయకపోయినా తొలినాళ్లలో తాము ఎలా ఉండేవారో ఇప్పటికీ అంతే స్నేహంగా మెలగుతుంటారు. ఆ ఇద్దరు ఎక్కడ కలుసుకున్నా ఆత్మీయంగా మాట్లాడుకుంటారు. అప్పుడప్పుడు సందర్భానుసారం ఫోన్లో కూడా ఇరువురు మాట్లాడుకుంటారు. ఇటీవల అలాంటి సంఘటనే ఒకటి జరిగిందని సమాచారం.
ఈ సంఘటనకు ప్రముఖ రచయిత వైరముత్తు వారధి అయ్యారు. కమల్‌హాసన్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘విశ్వరూపం’ చిత్రానికి ఆయన పాటలు రాస్తున్నారు. ఓ పాట గురించి చర్చించడానికి కమల్ ఆఫీసుకు వైరముత్తు వెళ్లారట. వారిద్దరూ మాట్లాడుతుండగా... ఆ సమయంలో వైరముత్తుకి రజనీ ఫోన్ చేశారట. అప్పుడు మాటల్లో.. ‘‘నేను కమల్ ఆఫీసులో ఉన్నాను’’ అని రజనీకి వైరముత్తు చెప్పడంతో... ఎలాంటి భేషజం లేకుండా కమల్‌కి ఫోన్ ఇవ్వమన్నారట రజనీ. అలా సాగిన సంభాషణలో రజనీ చేయబోతున్న ‘కోచడయాన్’ చిత్రానికి సంబంధించిన టాపిక్ వచ్చిందని వినికిడి. ఆ చిత్రం షూటింగ్‌ని చూడాలని ఉందని, ముఖ్యంగా పాటల చిత్రీకరణ సమయంలో మీ డాన్స్ చూడాలని ఉందని రజనీతో కమల్ అన్నారట. వెంటనే.. రజనీ ‘యు ఆర్ ఆల్‌వేస్ వెల్కమ్’ అంటూ తనదైన శైలిలో చెప్పారని సమాచారం. ఇంకా ఈ స్నేహితులిద్దరూ చాలాసేపు ఫోన్లో ముచ్చట్లు చెప్పుకున్నారట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more