Abk filed implead petition

abk prasad filed implead petition.ramoji rao, vijaya sai reddy, abk prasad, chandrababu naidu.

abk prasad filed implead petition.ramoji rao, vijaya sai reddy, abk prasad, chandrababu naidu.

abk filed implead petition.GIF

Posted: 12/13/2011 02:55 PM IST
Abk filed implead petition

abk_prasad

జగన్ పై ఎవరు తప్పుగా మాట్లాడిన, ప్రచారం చేసినా అతను తన విలనిజాన్ని ప్రదర్శించడం అలవాటు. తన అవినీతిని బయటకు ఎత్తి చూపిస్తున్న టీటీడీని, తన పై సీబీఐ విచారణకు ఆదేశించిన కాంగ్రెస్ ప్రభుత్వం పైనా జగన్ విమర్శలు గుప్పిస్తున్నాడు. తన ఆస్తుల పై విచారణకు ఆదేశించిన న్యాయమూర్తిని సైతం జగన్ వదలడం లేదు. హైకోర్టు న్యాయమూర్తిగా పదవి విరమణ పొంది, మానవ హక్కుల కమీషనర్ గా నియమితుడయ్యాడు ఇతని పై కూడా తన పత్రిక ద్వారా విమర్శలు గుప్పించాడు.

తాజాగా తనకు బద్ద శత్రువైనా రామోజీరావు పై ఇంతకు ముందు ‘ఈనాడు’ లో పని చేసిన ఏబీకే ప్రసాద్ తోనే పిటీషన్ దాఖలు చేయించాడు.  చంద్రబాబు తదితరులు వేసిన ఈ పిటిషన్లపై విచారణలో తమను ఇంప్లీడ్ చేయాలంటూ సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, సాక్షి వైస్‌చైర్మన్ విజయసాయిరెడ్డి హైకోర్టులో ఓ ఉమ్మడి పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదన సైతం వినాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను తమ వాదన వినకుండా సడలించవద్దని కోరారు.  'ఈనాడు'తో పాటు పలు దిన పత్రికలకు ఫౌండర్ ఎడిటర్‌గా పనిచేసిన తనకు.. రామోజీరావుకు సంబంధించిన పలు విషయాలు తెలుసునని, వాటిని కోర్టు దృష్టికి తీసుకురావడం కోసమే ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు ఏబీకే పేర్కొన్నారు. ఆదాయపు పన్ను ఎగవేతకు సంబంధించి రామోజీరావు పలు గిమ్మిక్కులకు పాల్పడ్డారని, కంపెనీలు నష్టాల్లో ఉన్నట్లు చూపించారని ఆయన పేర్కొన్నారు.

వ్యయాన్ని ఎక్కువగా చూపడం ద్వారా నష్టాలను తెర ముందుకు తీసుకొచ్చారన్నారు. దీనికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖాధికారులు జారీ చేసిన నోటీసులను పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండానే మార్గదర్శి ద్వారా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారని తెలిపారు. ఉషోదయా టీవీ డివిజన్, ఉషా కిరణ్ మూవీస్‌కు సంబంధించిన లెక్కలను ప్రస్తావిస్తూ.. పాత చిత్రాల హక్కుల అమ్మకాలకు సంబంధించి తిమ్మిని బమ్మిని చేసి చూపించారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామోజీరావు, ఆయన కంపెనీలు అనేక ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందినట్లు ఏబీకే నివేదించారు. సాంకేతిక విప్ల వం అంటూ అప్పట్లో చంద్రబాబు కొత్త కంపెనీలకు రాయితీల పందేరం చేశారని.. వాటిలో చాలావరకు బా బు బినామీలకు చెందినవేనన్నారు.
అయితే ఏబీకే తో పిటీషన్ వేయించడంతో, జగన్ రామోజీరావు పై మరో వ్యక్తిని ఉసిగొల్పి పిటీషన్ వేయించాడని అనుకుంటున్నారు. మొత్తానికి జగన్ విలనిజం మరో భయటపడిందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jeevitharajasekhar
Harbhajan singh robbed on road  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more