Oke Oka Jeevitham trailer promises an sci-fi drama ఆస‌క్తి రేకెత్తిస్తున్న శ‌ర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ట్రైల‌ర్‌

Oke oka jeevitham trailer sharwanand film promises a sentimental time travel story

Oke Oka Jeevitham, Trailer, Oke Oka Jeevitham Trailer, Sharwanand, Ritu Varma, Amala Akkineni, Vennela Kishore, Priyadarshi, Nassar, Ali, Ravi Raghavendra, Yog Jappe, Madhunandan, Jay Adithya, Nithyaraj, Hitesh, Shree Karthick, Jakes Bejoy, Tollywood, Movies, Entertainment

Tollywood's ace actor Sharwanand always picks a unique project and surprises all his fans and the audience with a complete new script! This time too, he opted to go with an interesting and intriguing time travel concept and is all set to entertain with his upcoming movie 'Oke Oka Jeevitham'… As the release date is nearing, the makers dropped the trailer and showcased us a glimpse of the plot leaving us await to hit the theatres.

ఆస‌క్తి రేకెత్తిస్తున్న శ‌ర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ట్రైల‌ర్‌

Posted: 09/02/2022 07:22 PM IST
Oke oka jeevitham trailer sharwanand film promises a sentimental time travel story

టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ మంచి స్టోరీ లైన్ ఉన్న చిత్రాలను ఎంచుకుని ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసే ప్రయత్నాలు చేస్తుండటం తెలిసిందే. గ‌త కొంత కాలంగా ఈయ‌న సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సవ్వడి చేయలేకపోయినా.. ఆయన వెనకడుగు వేయడం లేదు. ఇటీవ‌ల శర్వా న‌టించిన ‘ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు’ భారీ అంచ‌నాల‌తో విడుద‌లైనా ఆడవాళ్లను చిత్రానికి రప్పించలేకపోయింది. ఈ చిత్రం తన కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. కాగా, ఇప్పుడు శర్వాకు చక్కని హిట్టు అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో శర్వా తాజాగా న‌టించిన ‘ఒకే ఒక జీవితం’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

శ్రీకార్తిక్ ద‌ర్శ‌క‌త్వం ఈ చిత్రం టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కింది. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, పాట‌లు సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ చేశాయి. మేక‌ర్స్ తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. శ‌ర్వానంద్ ఏదో మ్యూజిక్ కాంపిటేష‌న్‌కు ప్రాక్టీస్ చేస్తున్నట్లు ట్రైల‌ర్ ప్రారంభమ‌వుతుంది. అంత‌లోనే రీతూవ‌ర్మ ‘కంగ్రాట్స్ ఆది.. ఫ‌స్ట్ రౌండ్‌లో సెలెక్ట్ అయ్యావ్’ అంటూ శ‌ర్వాతో ప‌లికిన సంభాష‌ణ ఆక‌ట్టుకుంటుంది. అయితే కాంపిటేష‌న్‌లో శ‌ర్వా పాడ‌లేక ఇబ్బంది పడుతుంటాడు. అస‌లు ఎందుకు ఇబ్బంది ప‌డుతున్నాడ‌నేది సినిమా చూస్తే తెలుస్తుంది. మ్యారేజ్ బ్రోక‌ర్‌గా వెన్నెల కిషోర్ ట్రైల‌ర్‌లో కనింపించాడు.

ఇక‌ ప్రియ‌ద‌ర్శి త‌ను ఎలాగైన ఒక ప‌ర్‌ఫెక్ట్ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాల‌ని అనుకుంటుంటాడు. ‘ఏదేమైనా పెళ్ళి క‌రెక్ట్ టైంలోనే జ‌ర‌గాలిరా’ అంటూ వెన్నెల కిషోర్ డైలాగ్‌తో నాజ‌ర్  ఎంట్రీ ఇస్తాడు. నాజ‌ర్ ఈ చిత్రంలో సైంటిస్ట్‌గా క‌నిపించ‌నున్నాడు. టైం ట్రావెల్ మిష‌న్‌తో నాజ‌ర్ ఈ ముగ్గురుని వాళ్ళ బాల్యంలోకి పంపిస్తాడు. అస‌లు వీళ్ళ‌ పాస్ట్‌లో ఏం జ‌రిగింది? మ‌ళ్ళీ వీళ్ళు గ‌తంలోకి ఎందుకు వెళ్ళాల‌ని అనుకున్నారు? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తే తెలుస్తుంది. శ‌ర్వానంద్ త‌ల్లిగా అక్కినేని అమ‌ల, జోడీగా రీతూవ‌ర్మ న‌టించింది. డ్రీమ్ వారియ‌ర్స్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్‌.ఆర్ ప్ర‌కాష్ బాబు, ఎస్‌.ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 9న‌ తెలుగు, త‌మిళంలో విడుద‌ల‌వుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oke Oka Jeevitham  Trailer  Sharwanand  Ritu Varma  Amala Akkineni  Shree Karthick  Jakes Bejoy  Tollywood  

Other Articles