Sivakarthikeyan's ‘Prince' First Single out శివకార్తికేయన్ ‘ప్రిన్స్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..

Prince s bimbilikki pilapi song sivakarthikeyan s energetic dance moves catchy beats

Prince, Bimbiliki Pilaapi, Bimbiliki Pilaapi fist single, Sivakarthikeyan, Maria, Anudeep K.V, Ram Miriyala, Thaman S, sivakarthikeyan movies, sivakarthikeyan songs, prince telugu song, prince tamil new movies, bimbilikapilapi song, bimbilika pilapi tamil, bimbilika pilapi song prince, sivakarthikeyan prince, prince sivakarthikeyan, Bimbiliki Pilaapi Lyric Video, Aditya MusicTamil, sivakarthikeyan new song, tollywood, movies, entertainment

Sivakarthikeyan's Telugu film Prince is currently the talk of the town as the makers release the first single titled, Bimbilikki Pilapi. Composed by S Thaman and sung by Ram Miriyala, Ramya Behara, and Sahithi Chaganti, this peppy track with mass beats makes for a perfect party number.

శివకార్తికేయన్ ‘ప్రిన్స్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..

Posted: 09/02/2022 06:08 PM IST
Prince s bimbilikki pilapi song sivakarthikeyan s energetic dance moves catchy beats

త‌మిళ హీరో శివ కార్తికేయ‌న్ ప్ర‌స్తుతం తెలుగులో మార్కెట్‌ను పెంచుకునే ప‌నిలో ఉన్నాడు. ‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైన శివ కార్తికేయ‌న్‌ ‘డాక్ట‌ర్’, ‘డాన్’ వంటి వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్‌ను ఏర్ప‌రుచుకున్నాడు. ఈ క్ర‌మంలో శివ‌ నేరుగా తెలుగులో ‘ప్రిన్స్’ అనే ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌తో ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. ‘జాతిర‌త్నాలు’ ఫేం అనుదీప్ కేవి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుంది. కామెడీ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం దీపావ‌ళికి విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ వ‌రుస అప్‌డేట్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు.

తాజాగా చిత్ర‌బృందం ఈ సినిమాలోని ‘బింబిలిక్కి పిలాపి’ అంటూ సాగే మెలోడీయ‌స్ పెప్పి సాంగ్‌ను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు. రామ‌జోగ‌య్య శాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాట‌ను రామ్ మిర్యాల ఆల‌పించాడు. త‌మ‌న్ స్వ‌ర ప‌రిచిన ఈ పాట క్యాచీగా ఉంది. శివ కార్తికేయ‌న్ సిగ్నేచ‌ర్ స్టెప్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో శివ కార్తికేయ‌న్‌కు జోడీగా మారియా ర్యాబోష‌ప్క హీరోయిన్‌గా న‌టించింది. శ్రీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ ఎల్ఎల్‌పి, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శాంతి టాకీస్ బ్యాన‌ర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మొద‌టి ఈ చిత్రాన్ని ఆగస్టు 31న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల సినిమాను రెండు నెల‌లు వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles