లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు నాలుగేళ్ళ తర్వాత కమల్ వెండితెరపై కనిపించడంతో భిమానులు సంబురాలు చేసుకున్నారు. అందులో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాను చేయడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న కమల్‌కు ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇచ్చింది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపోందిన ఈ చిత్రం టేకింగ్, విజన్ వేరే లెవల్. కాగా విడుదలైన మొదటి రోజు నుండే కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. ఇప్పటికీ విక్రమ్ సినిమా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. ఇదంతా వింటుంటే మళ్లి కమల్ విక్రమ్ చిత్రం చూడాలని అనిపిస్తోంది కదూ. అయితే ఈ సారి వెండితెరపై కాకుండా బుల్లితెరపై చూసేయండీ. అదెలా అంటరా.. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో విక్రమ్ సినిమాను స్ట్రీమింగ్ కానున్నట్లు హాట్‌స్టార్ సంస్థ అధికారికంగా వెల్లడిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. జూలై 8 నుండి ఈ చిత్రాన్ని తమ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
ఈ వీడియోలో కమల్ ‘మనకు నచ్చని సినిమాని ఎన్ని సార్లు చూసిన చాల్లేదు కదూ.. పదండి చూసుకుందా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో’ అంటూ విక్రమ్ స్టైల్లో గన్ పేల్చుతూ చెప్పాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య రోలెక్స్ పాత్రలో 5 నిమిషాలు మెరిసాడు. సూర్య పాత్ర సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
The Eagle is coming to @DisneyPlusHSTel! #Vikram premieres July 8.#VikramOnDisneyplusHotstar @ikamalhaasan @Dir_Lokesh @anirudhofficial @VijaySethuOffl #FahadhFaasil @Suriya_offl @Udhaystalin @RKFI @RedGiantMovies_ @DisneyPlusHS pic.twitter.com/Al1NbmyE16
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) June 29, 2022
(And get your daily news straight to your inbox)
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more
Aug 04 | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు... Read more