యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదే కాంబోలో జనగణమన తెరకెక్కనుంది. లైగర్ విడుదల తర్వాతే ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించనుంది. ఈ క్రమంలో విజయ్.. శివ నిర్వాణతో సినిమాను పట్టాలెక్కించాడు. ప్రస్తుతం కాశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే నెలకొన్నాయి.
తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో విజయ్ దేవరకొండ సిగరెట్ తాగుతూ కూల్ లుక్‌లో ఉండగా.. సమంత పెళ్ళి కూతురు గెటప్‌లో ఉంది. ఈ చిత్రానికి ‘ఖుషి’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. కాశ్మీర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఆర్మీ ఆధికారిగా కనిపించనున్నాడు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 23న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
An explosion of Happiness, laughter, Love and family bonding #Kushi - Telugu Tamil Kannada Malayalam Dec 23 Worldwide Release
— Vijay Deverakonda (@TheDeverakonda) May 16, 2022
Spread the joy this Christmas, New Years@Samanthaprabhu2 @ShivaNirvana @MythriOfficial @HeshamAWMusic pic.twitter.com/HT3C38IT7I
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more