F3: Song Life Ante Itla Vundaalaa Promo ‘ఎఫ్‌-3’ నుంచి లైఫ్ అంటే ఇట్టా ఉండాల సాంగ్ అదుర్స్

F3 fun and frustration song promo life ante itta vundaala

F3 'Life Ante Itla Vundaalaa' song, Venkatesh, Varun Tej, Mehreen, Tamannah, f3, f3 trailer, f2 trailer, f3 sequel, f2 sequel, f2 part 2, F3 'Life Ante Itla Vundaalaa' song, F3 Pooja Hedge special song,. F3Movie Starring Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada, Sonal Chauhan. Anil Ravipudi, DSP, Dil Raju, Movie News, Entertainment, Tollywood

Director Anil Ravipudi made sure his fun franchise 'F3' will have elements in the right proportions for sections of the audience. The film starring Victory Venkatesh and Mega Prince Varun Tej has loads of fun which was proved through the theatrical trailer. wherein Pooja Hegde’s special Party Song- 'Life Ante Itla Vundaalaa' seems to be another crowd pulling factor.

‘ఎఫ్‌-3’ నుంచి లైఫ్ అంటే ఇట్టా ఉండాల సాంగ్ అదుర్స్

Posted: 05/16/2022 07:44 PM IST
F3 fun and frustration song promo life ante itta vundaala

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు ప్రేక్షకులను అలరించిన తరువాత మళ్లీ ఇన్నాళ్లకు అదే ఓరవడి కొనసాగుతోంది. అయితే మనీ మనీ చిత్రం అనుకున్నంతగా పెద్దగా ప్రేక్షకాధరణ పోందలేదు. కానీ ఎఫ్ 3 మాత్రం అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ రేంజ్ లో హిట్ అవవుతోందన్న అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనీల్ రావిపూడి దర్శకత్వంపై ఉన్న నమ్మకమే కారణం.  

మొద‌టి భాగం ఎప్-2 కంటే సీక్వెల్ మరింత భారీ విజ‌యం సాధిస్తుంద‌ని ‘ఎఫ్‌-3’ బృందం గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉంది‌. సంక్రాంతి కానుక‌గా 2019లో వ‌చ్చిన ‘ఎఫ్‌-2’ ఎంత‌టి భారీ విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. మూడేళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్కింది. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించగా వారి సరసన తమన్నా, మెహ్రీన్ మళ్లీ జత కడుతున్నారు. ఇప్ప‌టికే చిత్ర నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, పాట‌లు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం మే 27న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ఏదో ఒక అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తుంది. తాజాగా మేక‌ర్స్ చిత్రం నుంచి నటి పూజాహెగ్డే నటించిన స్పెషల్ సాంగ్ ప్రోమోను వదిలారు.

‘లైఫ్ అంటే ఇట్టా ఉండాలా’ అంటూ సాగే ఈ ప్రోమో ఆక‌ట్టుకుంటుంది. పూజాహెగ్డే న‌ర్తించిన ఈ సాంగ్ పూర్తి లిరిక‌ల్ వీడియో మే 17న విడుద‌ల కానుంది. ఈ ప్రోమోలో వెంక‌టేష్‌, వ‌రుణ్‌, పూజా వేసిన చిందులు అల‌రిస్తున్నాయి. దేవీ శ్రీ ప్ర‌సాద్ స్వ‌ర ప‌రిచిన ఈ పాట‌కు కాస‌ర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించ‌గా, రాహుల్ సిప్లీగంజ్‌, గీతా మాధురి ఆల‌పించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. వెంకీ, వ‌రుణ్‌ల‌కు జోడీగా త‌మ‌న్నా, మెహ‌రిన్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. సునీల్, సోనాల్ చౌహ‌న్‌లు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. సునీల్, సోనాల్ చౌహ‌న్‌లు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని సమకూర్చగా, పూజా హెగ్టే ఓ స్పెష‌ల్ సాంగ్‌లో మెరిసింది.  శ్రీ వెంకటేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh