Suriya to act with Jyothika again after 16 years భర్తతో కలసి నటిస్తున్న నటి జ్యోతిక

Suriya and wife jyothika to pair up for film after 16 years

Suriya, deaf and mute character, jyothika, naachiyar, indhraja ravichandran, bala, ‘Etharkkum Thunindhavan’ Kollywood box office, kollywood, movies, Entertainment

Actor Suriya new release ‘Etharkkum Thunindhavan’ is doing good at boxoffice, which was released on March 10. He also has other projects in the pipeline. We already reported that Suriya will be working for his next with director Bala. Now, reports state that Suriya will be playing a deaf and mute character in the film. It has already been announced that the film will have Suriya and Indhraja Ravichandran in main roles.

పదహారేళ్ల తరువాత భార్యభర్తలు కలసి నటిస్తున్న చిత్రం..

Posted: 03/18/2022 07:46 PM IST
Suriya and wife jyothika to pair up for film after 16 years

నటుడు సూర్య తన చిత్రంలోని క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేస్తాడన్న విషయం తెలిసిందే. గతంలో ఓ చిత్రంలో గూనివాడిగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అందుకోసం చాలా కష్టపడ్డాడు. సర్జరీలు కూడా చేయించుకున్నాడు. ఇలా తనకు నటనపై ఉన్న అమితాసక్తి, రాణించాలన్న తపనే ఆయన కోలీవుడ్ లో అగ్రహీరోగా నిలబెట్టింది. దీంతో అటు తమిళనాడుతో పాటు ఇటు తెలుగులోనూ అభిమానులను ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కాగా తాజాగా ఈ హీరో మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారు.

ఇంతకుముందు పేరళగన్, వారణం ఆయిరం, వేల్, మాట్రాన్‌ వంటి చిత్రాలలో ఆయన ద్విపాత్రాభినయం చేయడం.. అన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఇక 24 చిత్రంలో త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు. తాజాగా సంచలన దర్శకుడు బాల చిత్రంలో కథానాయకుడిగా డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నాడు సూర్య. ఇందులో రెండు పాత్రల్లో ఒకటి బదిర (మూగ, చెవుడు) పాత్ర అని సమాచారం. దీంతో ఈ చిత్రం కోసం సూర్య ఎంతగా కష్టపడుతాడోనని ఇప్పట్నించే ఆయన ఫ్యాన్స్ అందోళనకు గురువుతున్నారు.

ఈ క్రమంలో మరో చక్కని విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో సూర్య తన సతీమణి నటి జ్యోతికతో కలసి నటిస్తున్నాడు. సుమారు 16 ఏళ్ల తర్వాత జ్యోతిక భర్త సూర్యతో కలిసి ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. మరో కథానాయిక పాత్రను టాలీవుడ్‌ హీరోయిన్‌ కృతిశెట్టి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ చిత్రానికి అనిరుద్‌ సంగీతం అందించనున్నారు. టూడి వెంకట్‌ పతాకంపై సూర్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏప్రిల్‌ నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. సూర్యకు తొలి రోజుల్లో నంద, ఆ తర్వాత పితామగన్‌ చిత్రంతో మరో సంచలనం విజయాన్ని అందించిన బాల తాజాగా నిర్మించనున్న ఈ చిత్రంపై ఇప్పటి నుంచే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jyothika  bala  Suriya  deaf and mute character  naachiyar  indhraja ravichandran  Kollywood  

Other Articles