పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్లో 'భీమ్లా నాయక్' సినిమా అంచనాలను మించి హిట్ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సృష్టిస్తున్న సునామితో తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ పాయింటుకు చేరుకుంది. ఇక రెండో వారం నుంచి వచ్చే ప్రతీ రూపాయి ఈ చిత్ర నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు లాభాలను అర్జించిపెడుతోందని అనడంలో సందేహమే లేదు. అయితే పవన్ కల్యాణ్ కు అత్తారింటికి దారేది చిత్రం తరువాత దక్కిన ఈ విజయాన్ని ఫ్యాన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు.
కాగా, మంచి లాభాలను రాబట్టేందుకు రెడీ అవుతున్న ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో వ్యవధిలో ఓటిటీ ఫ్లాట్ ఫామ్ ప్రేక్షకుల ముందు సందడి చేయడానికి రెడీ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి రీమేక్. తొలివారమే ఈ చిత్రం దాదాపు 90 కోట్ల షేర్ కలెక్షన్లను 170 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. మూడో వారంలో ఈ చిత్రం ఏకంగా బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటి లాభాలను ఆర్జించింది.
ఇక ఇప్పటివరకు ఈ చిత్రం ఏకంగా రూ.192.72 కోట్లను ఆర్జిందించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భీమ్లానాయక్ చిత్రం త్వరలోని ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఈ చిత్రం మార్చి చివరి వారం నుండి డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. డిస్నీ+హాట్‌స్టార్, ఆహా సంస్థలు డిజిటల్ హక్కులను కొనుగోలు చేశాయి. ఈ చిత్రం మార్చి 25 నుంచి డిస్నీ హాట్ స్టార్ సహా ఆహా ఓటిటి ఫ్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఈ చిత్రాన్ని చూడని అభిమానులు.. ఇక ఓటిటి ఫ్లాట్ పామ్ పై చూడవచ్చు.
ఇక సినిమా ప్రారంభమైన తరువాత చిత్రానికి వెళ్లినా వారు కూడా ఈ చిత్రాన్ని మళ్లీ, మళ్లీ తమ సోంత ఇంట్లో టీవీలో ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రంలో పవన్ పోలీస్ అధికారిగా కనిపించగా, రానా ఎక్స్ మిలిటరి ఆఫీసర్‌గా నటించాడు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ మాటలు స్క్రీన్‌ప్లే అందించాడు. తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్ర హిందీ ట్రైలర్ తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more