Yester years Heroine To Play Key Role In Mahesh film మహేశ్ బాబు కొత్త ప్రాజెక్టులో అలనాటి టాప్ హీరోయిన్

Yester years heroine to play key role in mahesh trivikram film

Yesteryears Heroine, Shobana, Mahesh Babu, #SSMB 28, Pooja Hegde, Trivikram Srinivas, Nadiya, Sheha, Jushboo, Tabu, Senior Actors, Tollywood, Movies, Entertainment

Yester years Heroine Shobana Chandrakumar Pillai aka Shobana to play Key Role In superstar Mahesh Film. which is titled as #SSMB 28. The film is directed by popular director Trivikram Srinivas.

మహేశ్ బాబు కొత్త ప్రాజెక్టులో అలనాటి టాప్ హీరోయిన్

Posted: 02/21/2022 06:47 PM IST
Yester years heroine to play key role in mahesh trivikram film

ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన చిత్రాలలో సీనియర్ నటీమణులకు కల్పిస్తున్నారు. ప్రతి సినిమాలోను సీనియర్ హీరోయిన్ తో ఒక కీలకమైన పాత్రను చేయిస్తుంటారు. అత్తారింటికి దారేది చిత్రంలో నటి నదియాతో ప్రారంభమైన ఈ ఒరవడిని సన్నాఫ్ సత్యమూర్తిలో స్నేహ.. అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురంలో టబుల వరకు సాగింది. ఆ పాత్రకి వాళ్లు నిండుదనాన్ని తీసుకువస్తారనే ఆలోచనతో పాటు, గతంలో వాళ్లకి గల క్రేజ్ ఆ సినిమాకి హెల్ప్ అవుతుందని ఆయన భావిస్తారు.

అయితే తాజాగా మహేష్ బాబుతో రూపోందిస్తున్న చిత్రంలోనూ ఆయన ఈ ఒరవడిని కొనసాగిస్తున్నారని తాజా సమాచారం. ఈ సారి ఆయన సీనియర్ హీరోయిన్ శోభనను రంగంలోకి దింపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ తన తాజా చిత్రాన్ని మహేశ్ బాబుతో (#SSMB 28) చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో పిన్ని పాత్ర చాలా ముఖ్యమైనదిగా ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుందట. ఆ పాత్రకోసం శోభనను ఎంపిక చేశారని అంటున్నారు.

తెలుగులో హీరోయిన్ గా శోభన ఒక వెలుగు వెలిగారు. తెలుగుతెరపై అగ్రహీరోలుగా ముద్రపడిన హీరోలు చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబులతో కలసి నటించిన శోభన అలాగే చిన్న హీరోలతో కూడా కలసి నటించి.. ఆ చిత్రాలను కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిపారు. అమె నటించిన చిత్రాలలో 'కోకిల'.. 'అభినందన'.. 'రుద్రవీణ'.. 'రౌడీగారి పెళ్ళాం' వంటి సూపర్ హిట్స్ చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకాదరణ పోందుతున్నాయి. ఇక ఆయా చిత్రాల పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్ గానే నిలుస్తాయి. 1993లో వచ్చిన 'రక్షణ' కథానాయికగా ఆమె చివరి సినిమా, ఆ తరువాత చాలా గ్యాప్ తరువాత ఆమె రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. శోభన అభిమానులకు ఇది ఆనందాన్ని కలిగించే విషయమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yesteryears Heroine  Shobana  Key Role  Mahesh Babu  #SSMB 28  Pooja Hegde  Trivikram Srinivas  Tollywood  

Other Articles