ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న 'పుష్ప' చిత్రం ఈ నెల విడుదల కానున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపోందుతోంది. తొలి భాగం ఈ నెల 17న విడుదల కానుండగా, రెండో భాగం మాత్రం షూటింగ్ కొనసాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. కాగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఊపేస్తున్నాయి.
‘‘వెలుతురు తింటది ఆకు.. ఆకును తింటది మేక.. మేకను తింటది పులి.. ఇది కదరా ఆకలి.. పులిని తింటది చావు.. చావును తింటది కాలం.. కాలాన్ని తింటది కాళీ.. ఇది మహా అకలి.. దాక్కో దాక్కో మేక.. పులోచ్చి కోరుకుద్ది పీక..’’ అన్న పాటతో పాటు ‘‘నిను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే.. నీ చూపుల పైనే రెప్పలు వేసి కప్పేస్తావే.. కనిపించని దేవుడినే కన్నార్పక చూస్తావే.. కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే.. చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయనే.. చూపే బంగారమాయనే శ్రీవల్లి.. నవ్వే నవరత్నమాయేనే.. ’’ అన్న పాటలు ప్రేక్షకులకు తెగ నచ్చుతున్నాయి. ఇక తాజాగా సామి సామి అనే మూడవ సింగిల్ ను విడుదల చేసింది చిత్రబృందం.
‘‘నువ్వు అమ్మి అమ్మి అంటుంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ.. నా సామి.. నిన్ను సామి సామి అంటుంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి.. నా సామి.. నీ వెనకే వెనకే అడుగేస్తుంటే.. వెంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామి.. నీ పక్క పక్కనా కూసుంటుంటే పరమేశ్వరుడి దక్కినట్టుగుందిరా సామి..’ అంటూ సాగే ఈ మూడో పాట శ్రోతలని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నాలుగో సింగ్ ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ సాగిన సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక త్వరలో తొలి భాగం విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ముందస్తుగానే ప్రకటించినట్లు ట్రైలర్ ను విడుదల చేసింది.
అయితే అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా ట్రైలర్ విడుదలైంది. బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన ట్రైలర్ రాత్రి పొద్దుపోయిన తరువాత విడుదల చేశారు. అయినా అభిమానులకు మాత్రం ఎప్పుడెప్పుడు ట్రైలర్ విడుదల అవుతుందా అంటూ వేచిచూసిన నేపథ్యంలో రాత్రి విడుదలైనా దానిని వీక్షించారు. దీంతో లక్షల వ్యూస్ తో అలరిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలో విడుదలైన ఈ ట్రైలర్ కి కూడా మంచి ఆదరణ లభిస్తుంది.
"భూమిపై పెరిగే బంగారం... పేరు ఎర్రచందనం" అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. అల్లు అర్జున్ నటించే యాక్షన్ సీక్వెన్స్ లు, హీరోయిన్ రష్మిక మందన్నతో రొమాన్స్, చిత్తూరు యాస అన్నీ కలగలిపి 'పుష్ప' ఎలా ఉండబోతోందో ఈ ట్రైలర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ట్రైలర్ లో అల్లు అర్జున్, పహాద్ ఫస్సిల్ మధ్య పోటాపోటీగా యాక్షన్ సన్నివేశాలు వున్నాయి. ఇక ఇందులో అనసూయ భరత్వాజ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్ తదితరులు కూడా కీలక పాత్రలను పోషించారు. మరెందుకు ఆలస్యం మీరు ట్రైలర్ ను వీక్షించండీ..
(And get your daily news straight to your inbox)
May 21 | యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. మే6న విడుదలైన ... Read more
May 21 | తన పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులను కలవలేకపోయినందకు వారికి క్షమాపణలు చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సమయంలో ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని..క్షమించాలని కోరారు. ఈ మేరకు తాజాగా... Read more
May 21 | రామ్ హీరోగా లింగుసామి 'ది వారియర్' సినిమాను రూపొందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో రామ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన... Read more
May 21 | పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో నడిచే ఈ కథలో పవన్ సరసన నాయికగా... Read more
May 20 | ప్రయోగాత్మక కథలను.. నటనకు అస్కారమున్న పాత్రలను అందులోనూ యాక్షన్ సన్నివేశాల్లో నటించే స్కోప్ వున్న చిత్రాలను ఎంచుకోవడంలో విశ్వనటుడు కమల్ హాసన్ ఎప్పుడూ ముందుంటారు. చిత్రం ఎలాంటిదైనా ఆయాపాత్రలలో పరకాయ ప్రవేశం చేసిరా అన్నట్లుగా... Read more