యంగ్ హీరో సత్యదేవ్ - నిత్యామీనన్ జంటగా 'స్కైలాబ్' సినిమా రూపొందింది. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను, పృథ్వీ పిన్నమరాజు నిర్మించాడు. నిర్మాణ భాగస్వామిగా నిత్యా మీనన్ వ్యవహరించింది. ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. చాలా కాలం క్రితం స్కైలాబ్ పడుతుందనీ.. ఎవరూ బ్రతకరనే ప్రచారం గ్రామాల్లో బలంగా జరిగింది. దాంతో ఎవరికి ఇష్టమైనవి వారు చేసుకుని తిన్నారు.
ఏ క్షణంలో ఎక్కడ స్కైలాబ్ పడుతుందోనని ఆకాశం వైపు చూస్తూ భయంతో బ్రతికారు. ఆ సంఘటననే ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుందని అర్థమవుతోంది. టీవీలకు .. మొబైల్ ఫోన్లకు దూరంగా గడిచిన ఆ కాలానికి సంబంధించిన వాతావరణాన్ని బాగానే ప్రతిబింబించారు. సినిమాలో కావలసినంత కామెడీ ఉంటుందనే విషయం టీజర్ ను బట్టి తెలుస్తోంది. తులసి .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 4వ తేదీన విడుదల చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more