Naga chaitanya unveils first look of Naga Lakshmi 'బంగార్రాజు' నుంచి నాగలక్ష్మిగా కృతి శెట్టి లుక్!

Naga lakshmi first look out from nagarjuna akkineni s bangarraju

Bangarraju, Nagarjuna, Naga chaitanya, krithi shetty, Naga Lakshmi, Kalyan Krishna, Annapurna Studios, Zee Studios, Tollywood, Movies, Entertainment

The first look of actress Krithi Shetty from ‘Bangarraju’ was unveiled by hero Naga Chaitanya. In reply to Nagarjuna’s query on Bangarraju’s look, Chay displayed his wittiness that ‘Ladies First.’

'బంగార్రాజు' నుంచి నాగలక్ష్మిగా కృతి శెట్టి లుక్!

Posted: 11/18/2021 11:03 AM IST
Naga lakshmi first look out from nagarjuna akkineni s bangarraju

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం సీక్వెల్ గా గ్రామీణ నేపథ్యంలో రూపోందుతున్న 'బంగార్రాజు' సినిమా శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, నాగ చైతన్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చైతూకు జంటగా ఉప్పెన’తో చక్కని హిట్ ను సోంతం చేసుకున్న కృతి శెట్టి జంటగా నటించనుంది. నాగ్ సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ సహా జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్లింది.

ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన స్వర్గానికి సంబంధించిన హుషారైన పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. లుక్ పరంగా నాగార్జున కూడా మంచి మార్కులు కొట్టేశారు. కాగా సెప్టెంబర్ 3న కృతిశెట్టి పుట్టిన రోజును పురస్కరించుకుని అమెకు చిత్రయూనిట్ శుభాకాంక్షలను అందించింది. దీంతో అమె బంగార్రాజు చిత్రంలో ఛాన్స్ కొట్టేసిందని అర్థమైంది. అయితే అమెకు చెందిన పాత్రను పరిచయం చేస్తూ తాజాగా ఈ సినిమాలో కృతి శెట్టి పోషిస్తున్న నాగలక్ష్మి పాత్రను పరిచయం చేస్తూ తాజాగా నాగలక్ష్మి పాత్రకి సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు.

గ్రామీణ ఎన్నికలలో నాగలక్ష్మి గెలిచి తరువాత అమెను స్థానిక ప్రజలు ఊరేగింపుగా తీసుకెళ్తుంటారు. అప్పుడు తీసిన ఉరేగింపులో ఆమె జనాల వైపు చూస్తూ చేయి ఆడిస్తున్నట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తోంది. ఆమె చేతిలో ఖరీదైన స్పెట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓ విధంగా గ్రామీణ యువతిగా ఎన్నికలలో గెలిచినా.. అమెలో విజయగర్వం కూడా కోట్టేచ్చేవిధంగా.. ఈ కలర్ ఫుల్ లుక్ లో కృతి శెట్టి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. చూస్తుంటే 'బంగార్రాజు'లో నాగలక్ష్మి సందడి ఒక రేంజ్ లో ఉండనున్నట్టు అర్థమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles